AP's COVID Status: తొలి డోస్ టీకా తీసుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషన్, ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న మూడో విడత కోవిడ్ వ్యాక్సినేషన్; రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 106 పాజిటివ్ కేసులు నమోదు

రాష్ట్రంలో మూడో విడత కోవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. 60 ఏళ్లు పైబడిన మరియు 45-59 మధ్య ఉండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కలిగి ఉన్న వారికి ప్రభుత్వం టీకాల పంపిణీ చేపట్టింది. ఈ క్రమంలో మంగళవారం ఏపి గవర్నర్ బిశ్వభూషన్ సతీసమేతంగా వచ్చి విజయవాడ ఆసుపత్రిలో తొలి డోసు కోవిడ్ నివారణ టీకా వేయించుకున్నారు...

Coronavirus Outbreak. | (Photo Credits: Pixabay)

Amaravati, March 2: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ వ్యాప్తి ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ కేసులు సాధారాణ స్థాయిలోనే వస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో మూడో విడత కోవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. 60 ఏళ్లు పైబడిన మరియు 45-59 మధ్య ఉండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కలిగి ఉన్న వారికి ప్రభుత్వం టీకాల పంపిణీ చేపట్టింది. ఈ క్రమంలో మంగళవారం ఏపి గవర్నర్ బిశ్వభూషన్ సతీసమేతంగా వచ్చి విజయవాడ ఆసుపత్రిలో తొలి డోసు కోవిడ్ నివారణ టీకా వేయించుకున్నారు.

మూడో విడత వ్యాక్సినేషన్ డ్రైవ్ లో అర్హులైన వారు టీకా కోసం అధికారిక COWIN వెబ్ సైట్ (http://cowin.gov.in) పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.

ఇక ఏపిలో కరోనా కేసుల విషయానికి వస్తే, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,804 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 106 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,90,080 కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,87,185గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో ఒక్క చిత్తూరు జిల్లాలోనే  కొత్తగా 33 కోవిడ్19 కేసులు నమోదు కాగా, మిగతా అన్ని జిల్లాల్లో స్వ్వల్పంగానే కొత్త కేసులు వచ్చాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో కోవిడ్ మరణాలేమి నమోదు కాలేదు, ప్రస్తుతం ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 7169గా ఉంది.

నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 57 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,82,137 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 774 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement