Viral Video: టచ్ చేసి చూడు..గణపతి మండపాల్లో ఆడవారిపై చేతులు వేసిన లుచ్చాగాళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు..వీడియో చూస్తే శభాష్ పోలీసు అనాల్సిందే..

అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆవారాగాళ్ళను తెలంగాణ రాష్ట్ర పోలీసు ఆధ్వర్యంలోని షీ టీమ్స్ సక్సెస్ ఫుల్ గా బెండు తీస్తున్నారు. తాజాగా గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వినాయక మండపాల వద్ద దర్శనానికి వచ్చిన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 55 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Credits: X

అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆవారాగాళ్ళను తెలంగాణ రాష్ట్ర పోలీసు ఆధ్వర్యంలోని షీ టీమ్స్ సక్సెస్ ఫుల్ గా బెండు తీస్తున్నారు. తాజాగా గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వినాయక మండపాల వద్ద దర్శనానికి వచ్చిన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 55 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారు మహిళలను అనుచితంగా తాకడం, వారిని వెంబడించడం, నగరంలోని గణేష్ మండపాల దగ్గర అనుమతి లేకుండా యువతుల ఫొటోలు తీస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని గణేష్ మండపాల వద్ద హైదరాబాద్ షీ టీమ్స్​ మష్టీలో పోలీసులను పహారాకు పెట్టింది. పోకీరీలను గణపతి మండపాల్లో ఏ విధంగా అరెస్టు చేశారో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకన్న వీడియోలను సైతం హైదరాబాద్ సిటీ పోలీసులు సోషల్ మీడియాలో పెట్టడం విశేషం. గణపతి వేడుకల్లో యువతులు ఎవరైనా వేధింపులు ఎదుర్కొంటే వెంటనే వాట్సాప్,ఈమెయిల్, ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ద్వారా కానీ నేరుగా వచ్చి తమకు ఫిర్యాదు చేయాలని షీటీం అధికారులు చెబుతున్నారు.

Credits: X

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement