Astrology: డిసెంబర్ 25వ తేదీన గురు శని శుక్ర గ్రహాల కలయిక దృష్టియోగం ఏర్పడుతుంది ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
డిసెంబర్ 25 బుధవారం నాడు గురు గ్రహం శని గ్రహం సూర్యుడు మూడు కూడా కలయిక వల్ల దృష్టియోగం ఏర్పడుతుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ 25 చాలా ప్రత్యేకత కలిగి ఉంది ఈ రోజున మూడు ప్రధాన గ్రహాలు కలయిక శుభయోగాలను ఇస్తుంది. డిసెంబర్ 25 బుధవారం నాడు గురు గ్రహం శని గ్రహం సూర్యుడు మూడు కూడా కలయిక వల్ల దృష్టియోగం ఏర్పడుతుంది. ఈ గ్రహాల కలయిక వల్ల 12 రాశుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆ మూడు అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి- మేషరాశి వారికి డిసెంబర్ 25వ తేదీన చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ మూడు గ్రహాల కలయిక వల్ల ఏర్పడే దృష్టియోగం శుభ ఫలితాలను ఇస్తుంది. వ్యాపారవేత్తలకు ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. వీరు వీరికి నచ్చిన విధంగా జీవితాన్ని గడుపుతారు. ఎప్పటినుంచో కొనుగోలు చేయాలనుకున్న సొంత ఇంటి కల సులభంగా నెరవేరుతుంది. కొత్త సంవత్సరానికి ముందే వీరి సంపాదన పెరుగుతుంది. ఇచ్చిన అప్పులు వసూలు అవుతాయి. వ్యాపార పరంగా మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇది తల్లిదండ్రులకు ఆనందం కలిగించే అంశం.
Vastu Tips: మీ బెడ్ రూం నుండి ఈ 5 వస్తువులను వెంటనే తొలగించండి ...
సింహరాశి- సింహరాశి వారికి దృష్టియోగం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. వ్యాపారస్తులు విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. ఇది మంచి లాభాలను ఇస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు ఉన్నాయి. ఎప్పటినుంచో ఉపాధి కోసం వెతుకుతున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి అయిన వారికి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చాలా కాలంగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు తగ్గుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు కోర్టు సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
మకర రాశి- మకర రాశి వారికి దృష్టియోగం సానుకూల ఫలితాలను తీసుకొని వస్తుంది. స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు డబ్బును ఎక్కువగా పొందుతారు. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. శని గ్రహం అనుగ్రహం వల్ల భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. వివాహం కాని వారికి 2025 సంవత్సరం ప్రారంభంలోనే మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వివాహాలకు ఎక్కువ అవకాశం ఉంది. ఇది కుటుంబ సభ్యుల నుంచి ఆమోదం పొందుతారు. సీజనల్గా వచ్చే అనేక జబ్బుల నుండి విమోక్తి పొందుతారు. ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.