Horoscope Today 13 June 2022, Astrology: సోమవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే, ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..

కొన్ని రాశుల వారికి సోమవారం చాలా మంచిది. సింహ రాశి వారు వ్యాపారాన్ని పెంచుకోవడానికి ప్రయాణం చేయవలసి ఉంటుంది. మరోవైపు, తుల రాశి వారికి అనారోగ్యం నుండి ఉపశమనం లభిస్తుంది.

(Photo Credits: Flickr)

మేషం

కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. వ్యాపారులకు ఒక వ్యవహారంలో చిక్కులు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

వృషభం

చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు సోదరులతో స్థిరస్తి వివాదాల లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారమును ఆశించిన లాభాలు అందుకుంటారువిద్యార్థులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో కీలక సమాచారం అందుతుంది.

మిధునం

గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారులకు నిరుత్సాహకర వాతావరణం ఉంటుంది.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.

Telangana Govt Jobs 2022: నిరుద్యోగులకు మరో శుభవార్త, 1,433 పోస్టులకు తెలంగాణ ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌, త్వరలో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల  

కర్కాటకం

అవసరానికి సన్నిహితులు నుండి ధన సహాయం పొందుతారు. స్థిరస్తివిషయాలలో చికాకులు తొలగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది, గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. వ్యాపారులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

సింహం

నూతనరుణ ప్రయత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి కుటుంబ పెద్దల ఆరోగ్యవిషయంలోవైద్య సంప్రదింపులు అవసరమవుతాయి వ్యాపారులకు గందరగోళ పరిస్థితులుంటాయి ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి.

కన్య

వృత్తి ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. సంఘంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకున్నది సాధిస్తారు. దైవచింతన పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు.

తుల

ఇంటా బయట అందరితోసఖ్యతగా వ్యవహారిస్తారు ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. వాహన వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు అందుతాయి, స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశములు లభిస్తాయి.

వృశ్చికం

బంధు వర్గం మీ మాటతో విబేదిస్తారు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక వాతావరణం చికాకు పరుస్తుంది.

ధనస్సు

దాయదులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి అవరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం

ఆకస్మికధనలాభ సూచనలున్నవి. చేపట్టిన పనుల్లో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారలకు ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం యోగం ఉన్నది.

కుంభం

ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగుల కలలు నిజమవుతాయి. మిత్రులనుంచి శుభవర్తమానాలు అందుతాయి. భూ వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారములు ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగులకు ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది.

మీనం

ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు చేస్తారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి అనారోగ్య విషయంలో సమస్యలు తప్పవు వ్యాపారులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున పరిస్థితులు అంతగా అనుకుంలించవు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement