Hangout Thief: కదులుతున్న రైలులో చోరీకి యత్నం.. దొంగకు చుక్కలు చూయించిన ప్రయాణికుడు.. ఏం చేశాడంటే?
బిహార్లోని ఖగారియా స్టేషన్వద్ద కదులుతున్న రైలు కిటికీలో నుంచి ఫోన్ కొట్టేసేందుకు ప్రయత్నించాడు ఓ దొంగ. దీనిని గమనించిన ప్రయాణికుడు దొంగ మరో చేయిని పట్టుకున్నాడు. 15 కిలోమీటర్ల దూరం పాటు రైలుకు వేలాడుతూనే ప్రయాణించాడు.
Patna, September 16: కదులుతున్న రైల్లో (Train) నుంచి ఫోన్ (Mobile) దొంగతనానికి (Theft) యత్నించి దొరికిపోయాడు ఓ వ్యక్తి. బిహార్లోని ఖగారియా స్టేషన్వద్ద కదులుతున్న రైలు కిటికీలో (Window) నుంచి ఫోన్ కొట్టేసేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన ప్రయాణికుడు దొంగ మరో చేయిని పట్టుకున్నాడు. 15 కిలోమీటర్ల దూరం పాటు రైలుకు వేలాడుతూనే ప్రయాణించాడు. తనను వదిలిపెట్టాలంటూ దొంగ ప్రాధేయపడినా పట్టించుకోకుండా తర్వాత స్టేషన్ వచ్చేవరకు పట్టుకున్నారు. సాహెబ్పుర్ చేరుకున్న అనంతరం పోలీసులకు అప్పగించారు. దీనిని ఓ ప్రయాణికుడు వీడియో తీయగా.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దొంగను సాహెబ్పుర్కు చెందిన పంకజ్ సింగ్గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
Advertisement
సంబంధిత వార్తలు
Viral Baby: రెండు ముఖాలు, నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు, ఉత్తరప్రదేశ్ లో వింతశిశువును చూసేందకు ప్రజల క్యూ, మీరూ చూసేయండి (వీడియో)
Mukhtar Ansari Hospitalized: జైల్లోనే కుప్ప‌కూలిన గ్యాంగ్ స్ట‌ర్ ముక్తార్ అన్సారీ, ఐసీయూలో చికిత్స అందిస్తున్న జైలు సిబ్బంది, త‌న ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని గ‌తంలో ప‌లుమార్లు లేఖ‌లు
Gurugram Shocker: డాగ్‌ ఫైట్‌లో ఓడిన కుక్కపై వాట్సాప్ గ్రూప్‌లో డిష్కషన్, స్నేహితులతో కలిసి ఇంటికెళ్లి మరీ కాల్చి చంపిన యువకుడు, హత్యకు దారి తీసిన వాట్సాప్‌ గ్రూప్‌లో డిస్కషన్
Madhya Pradesh: నాలుగు కాళ్లతో పుట్టిన శిశువు, మధ్యప్రదేశ్ లో వింత ఘటన, చూసేందుకు వస్తున్న జనం..
Advertisement
Advertisement
Advertisement