Representational Image (Photo Credits: Pixabay)

Gurugram, March 03: డాగ్‌ ఫైట్‌పై (Dog fight) ఒక వ్యక్తి వాట్సాప్‌ గ్రూప్‌లో (Whats app) విమర్శించాడు. ఫైట్‌లో చనిపోయిన కుక్కపై వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు అతడ్ని కాల్చి చంపారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది. కొందరు వ్యక్తులు అక్రమంగా డాగ్ ఫైట్‌ నిర్వహిస్తున్నారు. రాజకమల్ అనే వ్యక్తి దీని కోసం ఒక వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేశాడు. ఫిబ్రవరి 26న పటౌడీలోని బసపదంక గ్రామంలో పెంపుడు కుక్కల మధ్య ఫైట్‌ నిర్వహించారు. ఈ ఫైట్‌లో ఆనంద్‌ కుమార్‌కు చెందిన కుక్క చనిపోయింది. కాగా, డాగ్‌ ఫైట్‌ను చూసిన రాజ్‌కమల్‌, చనిపోయిన ఆనంద్‌ కుక్కపై ఆ వాట్సాప్‌ గ్రూప్‌లో విమర్శిస్తూ కొన్ని మెసేజ్‌లు పోస్ట్‌ చేశాడు. దీంతో సభ్యుల మధ్య చర్చకు, వాగ్వాదానికి ఇది దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆనంద్‌ను ఆ వాట్సాప్‌ గ్రూప్ నుంచి తొలగించారు. దీంతో రాజ్‌కమల్‌పై అతడు శతృత్వం పెంచుకున్నాడు. అదే రోజు రాత్రి వేళ ఆనంద్‌ మరో ఇద్దరు కలిసి గన్‌తో కాల్పలు జరిపి రాజ్‌కమల్‌ను చంపారు.

Madhya Pradesh Horror: భర్తను గొడ్డలితో నరికేసిన భార్య, అయినా కక్ష తీరక అతని ప్రైవేట్ పార్టులను కోసేసిన కసాయి, తాగొచ్చి వేధిస్తుండటమే కారణం 

మరోవైపు రాజ్‌కమల్‌ హత్యపై (Murder) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితులైన ఆనంద్‌ కుమార్‌, హితేష్ అలియాస్ డేవిడ్, భూపేందర్ అలియాస్ భీమ్‌లను అరెస్టు చేశారు. నాటు తుపాకీ, బుల్లెట్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. ఆనంద్ నోయిడాలోని ఒక అకాడమీలో టెన్నిస్ టీచర్‌ అని పోలీసులు తెలిపారు. హితేష్ మాజీ జావెలిన్ త్రోయర్ కాగా, భూపేందర్ టోల్ ప్లాజాలో పనిచేస్తున్నాడని వెల్లడించారు.