Delhi Horror: పట్టపగలు నడిరోడ్డు మీద యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు.. ఎందుకు పొడవాల్సివచ్చిందో చెప్పిన నిందితుడు.. ఢిల్లీలో ఘటన (వీడియో వైరల్)

దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు నడిరోడ్డు మీద దారుణం జరిగింది. వీధి వెంట నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై ఒక దుండగుడు అకస్మాత్తుగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. కత్తితో ఇష్టమొచ్చినట్టుగా పొడిచాడు.

Delhi Attack (Credits: ANI)

Newdelhi, Mar 24: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) పట్టపగలు నడిరోడ్డు మీద దారుణం జరిగింది. వీధి వెంట నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై ఒక దుండగుడు అకస్మాత్తుగా కత్తితో దాడికి (Attack) పాల్పడ్డాడు. కత్తితో ఇష్టమొచ్చినట్టుగా పొడిచాడు. ఆ తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకున్నారు. నిందితుడ్ని 22 ఏళ్ల అమన్‌ గా గుర్తించారు. స్థానికంగా నివసిస్తున్న అతడు పేయింగ్‌ గెస్ట్‌ వసతి గృహంలో కుక్‌గా పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

Wine Shops Close in Hyderabad: మందుబాబులకు అలర్ట్... జంటనగరాల పరిధిలో వైన్ షాపులు, కల్లు దుకాణాలు మూసివేత.. బార్ అండ్ రెస్టారెంట్లు కూడా.. నేటి సాయంత్రం 6 గంటల నుంచి 24 గంటల పాటు బంద్.. కారణం ఏమిటంటే??

ఎందుకు పొడిచానంటే??

అయితే బాధితురాలు తరుచుగా తనను వెక్కిరించి ఎగతాళి చేయడంతోపాటు వెర్రివాడిగా పిలుస్తున్నదని అమన్ ఆరోపించాడు. దీంతో ఆగ్రహించి కత్తితో ఆమెపై దాడి చేసినట్లు పోలీసులకు చెప్పాడు. ఐతే, నిజానిజాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బాధితురాలికి ప్రాణాపాయం తప్పింది. దాడికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Delhi CM Arvind Kejriwal: జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తున్న అరవింద్ కేజ్రీవాల్, ఈడీ కస్టడీ నుంచి తొలి ఉత్తర్వులు జారీ చేసిన కేజ్రీవాల్

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement