Wine Shops (Credits: Pixbay)

Hyderabad, Mar 24: జంటనగరాలు హైదరాబాద్ (Hyderabad), సికిందరాబాద్ (Secunderabad) లోని మందుబాబులకు అలర్ట్. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి వైన్ షాప్ (Wine Shops) లు మూతపడనున్నాయి. బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు కూడా బంద్ పెట్టాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హోలీ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్ తోపాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలు జరగకుండా వైన్స్ ను మూసి ఉంచాలని సూచించారు. దీంతో ఈ రోజు (ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి 26న (సోమవారం) సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు, కల్లుదుకాణాలు, రెస్టారెంట్లు మూతపడనున్నాయి.

Delhi CM Arvind Kejriwal: జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తున్న అరవింద్ కేజ్రీవాల్, ఈడీ కస్టడీ నుంచి తొలి ఉత్తర్వులు జారీ చేసిన కేజ్రీవాల్

కారణం ఏమిటంటే?

హోలీ వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Arvind Kejriwal: అర‌వింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో షాక్, పిటీష‌న్ ను అత్య‌వ‌స‌రంగా విచారించేందుకు నిరాక‌రించిన కోర్టు