Chicken or the Egg? కోడి ముందా లేక గుడ్డు ముందా అనే ప్రశ్నకు బలైన స్నేహితుడు, సమాధానం చెప్పలేదని కత్తితో దారుణంగా పొడిచి చంపిన మరో స్నేహితుడు

ఆగ్నేయ సులవేసి ప్రావిన్స్‌లోని మునా రీజెన్సీలో జూలై 24న ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఇండిపెండెంట్ ప్రచురించిన నివేదిక ప్రకారం , అనుమానితుడు DR గా గుర్తించబడ్డాడు, అతని స్నేహితుడు కదిర్ మార్కస్‌ని మందు పార్టీ కోసం ఆహ్వానించాడు.

Crime (Photo-File)

జకార్తా, జూలై 31: కోడి ముందా లేక గుడ్డు ముందా అనే ప్రశ్న స్నేహితుడి హత్యకు దారి తీసింది. ఆగ్నేయ సులవేసి ప్రావిన్స్‌లోని మునా రీజెన్సీలో జూలై 24న ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఇండిపెండెంట్ ప్రచురించిన నివేదిక ప్రకారం , అనుమానితుడు DR గా గుర్తించబడ్డాడు, అతని స్నేహితుడు కదిర్ మార్కస్‌ని మందు పార్టీ కోసం ఆహ్వానించాడు. అనేక రౌండ్లు మద్యం సేవించిన తర్వాత ఇద్దరి మధ్యా ప్రశ్న జవాబు పోటీ మొదలైంది. కోడి లేదా గుడ్డు ఏది ముందు వచ్చింది అనే దానిపై ఇద్దరి మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. అయితే గొడవ పెద్దది కావడంతో అక్కడి నుంచి మార్కస్ వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. అయినప్పటికీ సమాధానం చెప్పాలంటూ DR బైక్‌పై అతనిని వెంబడించాడు. అతను ఆగకపోవడంతో కోపంతో దక్షిణ సులవేసి యొక్క తీరప్రాంత తెగలకు చెందిన సాంప్రదాయ బాకుతో అతనిపై పలుసార్లు దాడి చేశాడు.  యూఎస్‌లో దారుణం, 8 నెలల పసిపాప ముందు కారులో వేశ్యతో తండ్రి సెక్స్, సీన్ చూసి ఒక్కసారిగా షాకైన పోలీసులు, నిందితుడు అరెస్ట్

మార్కస్‌ను చుట్టుపక్కలవారు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, అతను చికిత్స పొందుతూ మరణించాడు. ఘటన జరిగిన సమయంలో ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. టోంగ్కునో పోలీసు చీఫ్ ఇప్తు అబ్దుల్ హసన్ DR అరెస్టును ధృవీకరించారు. నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని, నిందితుడు ధరించిన ప్యాంటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. DRపై హత్యా నేరం మోపబడింది. నేరం రుజువైతే 18 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. విచారణ కొనసాగుతుండగా మార్కస్‌కు జూలై 26న అంత్యక్రియలు జరిగాయి. గతేడాది కూడా ఇదే తరహాలో ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుడిని వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించిన తర్వాత కత్తితో పొడిచాడు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif