Cow at Traffic Signal: ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్న ఆవు.. గ్రీన్ సిగ్నల్ కోసం ట్రాఫిక్ కూడలి వద్ద వాహనాలే కాదు ఈ ఆవు కూడా ఆగిందోచ్.. పూణెలో ఘటన, వీడియోను షేర్ చేసిన స్థానిక పోలీసులు.. మీరూ చూడండి!

వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. పసుపు పచ్చ, రెడ్ సిగ్నల్స్ పడ్డా ఆగని వాహనదారులు కూడా ఉన్నారు.

Cow at Traffic Signal (Credits: Instagram)

Pune, June 28: వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ (Traffic Rules) పాటించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. పసుపు పచ్చ, రెడ్ సిగ్నల్స్ పడ్డా ఆగని వాహనదారులు కూడా ఉన్నారు. అయితే, ఓ ఆవు ట్రాఫిక్ నిబంధనలను గౌరవిస్తూ ట్రాఫిక్ కూడలి వద్ద గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూడటం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. అసలేం జరిగిందంటే.. మహారాష్ట్రలోని పూణెలో (Pune) ఓ ట్రాఫిక్ కూడలి వద్ద రెడ్ సిగ్నల్ పడటంతో ఓ ఆవు ఆగిపోయింది. తెల్లగీతను దాటకుండా నిలబడింది.

ఇంత దారుణమా, రద్దీ రోడ్ల మీద మహిళ నగ్నంగా వెళుతుంటే కెమెరాలకు పని చెప్పిన వాహనదారులు, కప్పుకోవడానికి బట్టలు ఇవ్వకూండా..

 

View this post on Instagram

 

A post shared by Pune City Police (@punepolicecity)

హారన్లు మోగుతున్నా..

వెనక వాహనాల హారన్లు మోగుతున్నా అది పట్టించుకోలేదు. ఇతర వాహనదారుల వలెనే అది గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూసింది. సిగ్నల్ మారగానే ముందుకు కదిలింది. ఈ వీడియోను షేర్ చేసిన పూణె పోలీసులు పనిలోపనిగా ఆవు క్రమశిక్షణను పోలుస్తూ వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై కీలక సూచనలు కూడా చేశారు.

వీడియో ఇదిగో, వర్షంలో యువతి డ్యాన్స్ వేస్తుండగా పెద్ద శబ్దంతో పడిన పిడుగు, బిత్తరపోయి ఇంట్లోకి పరిగెత్తిన యువతి

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement