Good News For Kalki 2898 AD Team: రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి AD 2898' మూవీ టీంకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్.. అదనపు షోలకు ప్రభుత్వం అనుమతి.. టికెట్ రేట్ల పెంపునకు కూడా గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవిగో..!

రెబల్ స్టార్ ప్రభాస్ సరికొత్త చిత్రం 'కల్కి AD 2898' కోసం యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. భారీ బడ్జెట్, తారాగణంతో తెరకెక్కిన కల్కి టీంకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

Kalki 2898 AD Trailer

Hyderabad, June 25: రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) సరికొత్త చిత్రం 'కల్కి AD 2898' (Kalki 2898 AD) కోసం యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. భారీ బడ్జెట్, తారాగణంతో తెరకెక్కిన కల్కి టీంకు ఏపీ  ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో అదనపు షోలు నిర్వహించుకునేందుకు అనుమతులు ఇవ్వాలని, టికెట్ రేట్లు పెంచాలని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ కోరికను మన్నించింది. తొలి రెండు వారాలు 5 ఆటలు ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇచ్చింది.

రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి AD 2898' మూవీ టీంకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్.. బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి.. టికెట్ రేట్ల పెంపునకు కూడా గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవిగో..!

టికెట్ రేట్లు పెంపు కూడా 

అలాగే టికెట్ రేట్లు కూడా పెంచింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్ లలో రూ.125 దాకా టికెట్ ధర పెరిగింది. పెరిగిన ధరల ఎఫెక్ట్ తొలి రెండు వారాలు  ఉండనుంది. కాగా ఈ చిత్రం ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది.

అంచ‌నాల‌ను అమాంతం పెంచిన క‌ల్కి రిలీజ్ ట్రైల‌ర్, సైన్స్ ఫిక్ష‌న్, యాక్ష‌న్ మూవీ ట్రైల‌ర్ కు ఒళ్లు గ‌గుర్పొడ‌వ‌డం ఖాయం

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement