Gujarat: ఇదేం గొడవ..భర్త పోస్టులకు వేరే మహిళ లైక్, కోపంతో మొగుడు ఫోన్ పగలగొట్టిన భార్య, ఆమెను కిందపడేసి విచక్షణ రహితంగా కొట్టిన భర్త, పోలీసుల వద్దకు చేరిన పంచాయితీ
గుజరాత్‌లోని వడోదరలో అక్టోబరు 22న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Vadodara, Oct 25: సోషల్ మీడియాలో భర్త పోస్టులకు ఓ మహిళ లైక్ కొట్టిందని ఇద్దరు గొడవపడిన సంఘటన (Man, wife fight over ‘likes’ on social media in Vadodara ) గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. గుజరాత్‌లోని వడోదరలో అక్టోబరు 22న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వడోదర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడోదరలోని సదరు దంపతులకు సోషల్ మీడియాలో వేర్వేరు అకౌంట్‌లు ఉన్నాయి. ఈ క్రమంలో.. కొంతకాలంగా భర్త పోస్ట్‌లకు వేరే మహిళ లైక్‌లు చేయడాన్ని భార్య గమనించింది. దీంతో భర్త ఖాతాపై ఒక కన్నేసి ఉంచింది. భర్త.. ఏ పోస్టు (social media posts) చేసిన వెంటనే ఆ మహిళ లైక్‌లు కొట్టడం చేయసాగింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన భార్య... తన భర్త ఫోన్‌లను లాక్కుని కిందపడేసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం (Heated argument) జరిగింది. భర్త.. ఆమెను కిందపడేసి విచక్షణ రహితంగా కొట్టాడు.
ఈ క్రమంలో ఆమె అభయం అనే పోలీసు హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి భర్తపై ఫిర్యాదు చేసింది. వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ దంపతులిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి కట్టుకున్న భార్యపై చేయిచేసుకుంటే.. తీవ్ర పరిణామాలుంటాయని కౌన్సిలింగ్ నిర్వాహకులు బాధిత మహిళ భర్తను హెచ్చరించారు.