Drunken Women Hulchul At KPHB: కేపీహెచ్ బీలో యువతుల హల్ చల్.. మద్యం మత్తులో కారుతో బీభత్సం.. వీడియో వైరల్
హైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌజింగ్ బోర్డ్ (కేపీహెచ్ బీ) ముగ్గురు యువతులు హల్ చల్ చేశారు. మద్యంమత్తులో కారు నడుపుతూ బీభత్సం సృష్టించారు. కేబీహెచ్ బీ మెట్రో స్టేషన్ వద్ద ఓ బైకును ఢీకొట్టిన ముగ్గురు యువతులు.. ఆపై అతనితో గొడవకు దిగారు.
Hyderabad, Mar 7: హైదరాబాద్ లోని (Drunken Women Hulchul At KPHB) కూకట్ పల్లి హౌజింగ్ బోర్డ్ (కేపీహెచ్ బీ) ముగ్గురు యువతులు హల్ చల్ చేశారు. మద్యంమత్తులో కారు (Car) నడుపుతూ బీభత్సం సృష్టించారు. కేబీహెచ్ బీ మెట్రో స్టేషన్ వద్ద ఓ బైకును ఢీకొట్టిన ముగ్గురు యువతులు.. ఆపై అతనితో గొడవకు దిగారు. బైకర్ ను బెదిరించడంతో పాటు అతనిపై ఒకింత దాడికి యత్నించారు. దీంతో భయపడిపోయిన అతడు సమీపంలోని ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కారులోని యువతుల్లో ముఖ్యంగా కారు నడుపుతున్న యువతికి బ్రీత్ అనలైజర్ తో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేశారు.
టెస్టులో 212 పాయింట్లు
టెస్టులో 212 పాయింట్లు నమోదయింది. దీంతో సదరు తువతి ఫూటుగా మద్యం తాగినట్లు నిర్ధారించారు. కారులో డ్రైవింగ్ చేస్తున్న యువతితోపాటు మరికొందరు ఉన్నారు. వారంతా కూడా ఫుల్లుగా మద్యం సేవించినట్లు తెలిపారు. కారులో బీర్ క్యాన్లను గుర్తించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.