Dress Code: మీరు లోపల వేసుకొనే అండర్ వేర్ కూడా డ్రెస్ కోడ్ నిబంధనలను పాటించాలి.. పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ వింత రూల్.. దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. వెనక్కి తగ్గిన సంస్థ
లో దుస్తుల విషయంలోనూ డ్రెస్ కోడ్ పాటించాలన్న పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్.. సర్వత్ర విమర్శలు.. చివరికి క్షమాపణలు
NewDelhi, October 1: లో దుస్తుల విషయంలోనూ డ్రెస్ కోడ్ పాటించాలన్న పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) చివరికి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. సిబ్బందికి సరైన వస్త్రధారణ లేకపోవడం వల్ల వ్యక్తిగతంగానే కాకుండా ఆ ప్రభావం ఎయిర్‌లైన్స్ పైనా పడుతోందని పేర్కొన్న సంస్థ.. లో దుస్తుల విషయంలోనూ డ్రెస్ కోడ్ పాటించాలని గురువారం ఆదేశాలు జారీ చేసింది.
పీఐఏ ఆదేశాలపై సర్వత్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియా అయితే దుమ్మెత్తి పోసింది. లోదుస్తుల విషయంలో డ్రెస్‌కోడ్ ఏంటంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెనక్కి తగ్గి పీఐఏ.. తమ ఉద్దేశం అది కాదని, సరైన వస్త్రధారణతో విధులకు హాజరు కావాలన్నదే తమ అభిమతమని పేర్కొంది.
Advertisement
సంబంధిత వార్తలు
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Major Tragedy Averted: షాకింగ్ వీడియో ఇదిగో, విమానం ల్యాండవుతుండగా రన్‌వే పైకి దూసుకొచ్చిన మరో విమానం, చివరకు ఏం జరిగిందంటే..
Plane Flips Upside Down: రన్ వేపై ల్యాండ్ అవుతూ తిరగబడిన విమానం.. తీవ్రంగా గాయపడిన 18 మంది ప్రయాణికులు.. కెనడాలో ఘటన.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో!
US Plane Crash: గత 24 ఏళ్లలో అమెరికాలో ఇదే అతిపెద్ద ప్రమాదం, 64 మందిలో ఎవరూ బతికే అవకాశం లేదు, వాషింగ్టన్ డీసీ విమాన ప్రమాదంపై అమెరికా అధికారిక ప్రకటన ఇదే..
Advertisement
Advertisement
Advertisement