Corona Devi Temple: కోయంబత్తూరులో కరోనా దేవి ఆలయం, 48 రోజుల పాటు రోజూ కరోనాదేవికి పూజలు నిర్వహించనున్న నిర్వాహకులు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు
తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో ఓ గ్రామంలోని ప్రజలు కరోనాకు విగ్రహం (Corona Devi Idol In Tamilnadu) నిర్మించి, దానికి కరోనా దేవి (Corona Devi Temple) అని పేరు పెట్టి నిత్య పూజలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ మహమ్మారి బారి నుంచి ప్రజల్ని రక్షించాలని వేడుకుంటూ 48 రోజుల పాటు రోజూ పూజలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు
Coimbatore, May 21: కోవిడ్ సంక్షోభ పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మూఢనమ్మకాలను పాటిస్తున్నారు. తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాలో ఓ గ్రామంలోని ప్రజలు కరోనాకు విగ్రహం (Corona Devi Idol In Tamilnadu) నిర్మించి, దానికి కరోనా దేవి (Corona Devi Temple) అని పేరు పెట్టి నిత్య పూజలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ మహమ్మారి బారి నుంచి ప్రజల్ని రక్షించాలని వేడుకుంటూ 48 రోజుల పాటు రోజూ పూజలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
కోయంబత్తూరు శివారులోని ఇరుగుర్‌లో కామట్చిపురి అధినం ఆధ్వర్యంలో ఈ కరోనా దేవి గుడిని (Corona Devi) నిర్మించారు. 1.5 అడుగుల నల్లరాతి విగ్రహాన్ని మఠం పరిసరాల్లోనే ఏర్పాటు చేశారు. దానికి కరోనా దేవిగా నామకరణం చేశారు. ప్రజల్ని రక్షించేలా చూడాలని ప్రార్థిస్తూ 48 రోజుల పాటు పూజలు నిర్వహించనున్నట్టు మఠం వర్గాలు వెల్లడించాయి. విపత్కర సమయాల్లో ఇక్కడ ఆలయాలు నిర్మించడం ఇదే తొలిసారి కాదు.
గతంలో ప్లేగు వ్యాధి వచ్చి అనేకమందిని పొట్టన పెట్టుకున్నప్పుడు కూడా జిల్లాలో మరియమ్మన్ విగ్రహాన్ని ఏర్పాటుచేసి రోజూ పూజలు నిర్వహించేవారు. ఆ తర్వాత ఈ స్థలం ప్లేగు మరియమ్మన్ ఆలయంగా ప్రసిద్ధి గాంచింది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కరోనా దేవి ఆలయంలోకి పూజారులు, మఠం అధికారులను మాత్రమే అనుమతించనున్నట్టు అధికారులు వెల్లడించారు.
Here's Corona Devi Temple Updates:
అయితే ఈ కరోనా దేవి రూపాన్ని ఓ హీరోయిన్‌తో పోల్చుతూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వ్యవహారంలోకి నటి వనిత విజయకుమార్‌ను లాగేశారు. కరోనా దేవి ముఖం, హీరోయిన్ వనితా విజయ్ కుమార్ ముఖం ఒకేలా ఉన్నాయని చెబుతూ మీమ్స్ రూపొందిస్తున్నారు. కొందరు వీటిని వనితా విజయ్ కుమార్ కు పంపడంతో ఆమె దీనిపై స్పందించింది. ప్రతి ఒక్కరూ ఈ ఫొటోతో పాటు మీమ్స్ పంపుతున్నారంటూ ఆమె ఆ ఫొటోను పోస్ట్ చేసింది. ఓ మై గాడ్.. అందరూ ఈ ఫోటోతో నన్ను పోల్చుతున్నారేంటి? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ఇదిలా ఉంటే ఈ మధ్య వనిత విజయ్ కుమార్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో హాట్ ఇష్యూగా మారిన సంగతి తెలిసిందే. ఇప్నడిలా మరోసారి నటి వనిత విజయ్ కుమార్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుండటం విశేషం.