కరోనావైరస్ తొలి దశ తరువాత సెకండ్ వేవ్ దేశంలో కల్లోలాన్ని రేపుతోంది. ఈ నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించి ఇంటి నుంచి బయటకు వస్తున్నారు. ఇందులో భాగంగానే వివిధ రకాల మాస్కులు దర్శనమిస్తున్నాయి, చవకైనవి, ఖరీదైనవి, సర్జికల్ మాస్కులు, రకరకాల రంగుల్లో మార్కెట్లో అమ్మకానికి ఉంటున్నాయి.
అయితే తాజాగా ఉత్తర ప్రదేశ్‌కు చెందిన జుగాడు బాబా ( Uttar Pradesh's Jugaadu Baba) కరోనా నుంచి రక్షణ కోసం ప్రకృతి మాస్క్ ధరించాడు. 72 ఏళ్ళ ఈ బాబా మూలికలతో తయారు చేసిన వెరైటీ మాస్క్ (Jugaadu Baba Wears Herbal Mask) ధరించి అందర్నీ ఆకర్షిస్తున్నాడు. నిమ్మ చెట్టు ఆకులు, తులసి ఆకులు, మరికొన్ని మూలికలతో కలిపి తయారు చేసిన ఇది (herbal mask for COVID-19) కోవిడ్ ని నివారిస్తుందని, పైగా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని ఈయన అంటున్నాడు.
ప్రస్తుతం బాబా ధరించిన వేప, తులసి ఆకులతో తయారు చేసిన మాస్క్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ (video goes viral) అవుతోంది. ఈ వీడియోను రూపీన్ శర్మ అనే ఐపీఎస్ అధికారి ట్విటర్‌లో పోస్టు చేస్తూ ‘‘ఈ మాస్క్ కరోనా నుంచి రక్షణ కల్పిస్తుందని కచ్చితంగా చెప్పలేం.కానీ అవసరం తల్లి లాంటిది’’ అని పేర్కొన్నాడు. ఓ వ్యక్తి ఆసక్తితో బాబా వద్దకు వచ్చి ఈ మాస్క్ ఎలా తయారు చేశారని అడిగాడు. దానికి ఆయన బదులిస్తూ.. వేప, తులసి ఆకులు ఏ రకమైన వ్యాధికైనా మంచి ఔషధంగా పనిచేస్తాయనేది మనకు తెలుసు.
జనాలు సాధారణంగా ఉపయోగించే మాస్క్‌ల కంటే ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని భావిస్తున్నట్టు బాబా తెలిపారు. తులసి, వేప ఆకులతో చేసిన ఈ మాస్క్ నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. కాగా జుగాడు బాబా ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా బస్ స్టాండ్ వద్ద ఈ ప్రకృతి మాస్క్‌తో కనిపించారు. స్థానికంగా జుగాడి బాబా అని వ్యవహరిస్తున్న ఈయన.. ఇది ఎన్నో ఏళ్ళ నాటి వైద్య సంబంధ ప్రక్రియ అని, ప్రతివారూ ఇలాంటి మాస్క్ ధరిస్తే మేలని సూచిస్తున్నాడు.
Here's Video
Not sure this #MASK WILL HELP.
जुगाड़☺️☺️
Still #मजबूरी_का_नाम_महात्मा_गांधी#NECESSITY_is_the_mother_of_JUGAAD #Mask And Medicine😂🤣😷😷😷 pic.twitter.com/uHcHPIBy9D
— Rupin Sharma IPS (@rupin1992) May 22, 2021
అతి తక్కువ ఖర్చుతో చేసిన దీన్ని రెండు మూడు రోజులకొకసారి మార్ఛవచ్చునట. యూపీలోని సీతాపూర్ జిల్లాలో ఈయన ఇలా తన మూలికా మాస్క్ తో ఆకట్టుకుంటున్నాడు. తమ కుటుంబం కూడా ఇలాంటి మాస్కులనే ధరిస్తోందని అంటున్నాడు. యూపీలో ఇప్పుడిప్పుడు కోవిడ్ కేసులు తగ్గుతున్నప్పటికీ ప్రతివారూ మాస్కులు ధరించాలన్న రూల్ ని ఖచ్చితంగా పాటిస్తున్నారు.