First Night Video on Social Media: లైకుల కోసం తెగించిన కొత్త జంట, ఏకంగా శోభనం వీడియోను ట్విట్టర్‌ లో పోస్టు చేసిన వధూవరులు, మేము ఎలా గడిపామో చూడండి అంటూ పోస్టు ఛీదరించుకుంటున్న నెటిజన్లు

కొత్తగా పెళ్లయిన దంపతులు నాలుగు గోడల మధ్య జరగాల్సిన పవిత్ర కార్యమైన తమ ఫస్ట్ నైట్(First night video) ను వీడియో తీశారు. అంతేనా.. ఆ వీడియోను ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశారు.

Representational Purpose Only (Photo Credits: Pexels)

New Delhi, FEB 09: సోషల్ మీడియా వచ్చాక జీవితాలే మారిపోయాయి. కొందరు సోషల్ మీడియాకు (Social media) బాగా అడిక్ట్ అయిపోయారు. తిండి, నిద్ర, నీరు లేకపోయినా ఉండగలరేమో కానీ సోషల్ మీడియాకు దూరంగా ఒక్క సెకను కూడా ఉండలేరు. అంతగా వాటికి బానిసలైపోయారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కొందరు జనాలు వాటితోనే గడిపేస్తున్నారు. షార్ట్ వీడియోలు (Shots), రీల్స్ (Reels) అంటూ తమకు తోచిన కంటెంట్ ను క్రియేట్ చేసి అందులోకి తోస్తున్నారు. ఇందులో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు లైకులతో వాటిని ఆదరిస్తున్నారు. దాంతో కొందరు ఫేమస్ అయిపోతున్నారు. ఇప్పుడిదే సమస్యగా మారింది. కొందరిలో సోషల్ మీడియా, లైకుల పిచ్చి బాగా ముదిరిపోయింది. ఎక్కువ లైక్స్ కోసం కొందరు దిగజారిపోతున్నారు. ఏం పోస్ట్ చేస్తున్నామనే సోయి కూడా లేకుండా పోయింది. దానికి నిదర్శనమే ఓ జంట పోస్టు చేసిన వీడియో. ఈ నూతన పెళ్లి జంట మరీ టూ మచ్ చేసింది. కొత్తగా పెళ్లయిన దంపతులు నాలుగు గోడల మధ్య జరగాల్సిన పవిత్ర కార్యమైన తమ ఫస్ట్ నైట్(First night video) ను వీడియో తీశారు. అంతేనా.. ఆ వీడియోను ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశారు.

అదేదో పబ్లిక్ కార్యం అన్నట్టు ఏమాత్రం సిగ్గూ శరం లేకుండా కెమెరా ఆన్ చేసి తమ ముద్దు, ముచ్చట, బట్టలిప్పడం ఇలా అన్నీ రికార్డు చేసుకున్నారు. అంతేనా.. ఆ వీడియోని పబ్లిక్ డొమైన్‌లో పెట్టేశారు. అంతే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral video) అయ్యింది. ఆ జంట ఆశించినట్లే వీడియో వైరల్ అయితే అయ్యంది కానీ, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదేం పిచ్చి పని అని మండిపడుతున్నారు. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు అని కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.

Uttar Pradesh: కోర్టు ఆవరణలోకి చిరుతపులి, ఏడుమందిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలు, ఘజియాబాద్ జిల్లా కోర్టులో షాకింగ్ ఘటన, వీడియో ఇదే.. 

ఇలాగే వదిలేస్తే పోర్న్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తారేమో అని ఓ నెటిజన్ ఘాటుగా కామెంట్ పెట్టారు. సోషల్ మీడియా కంటెంట్‌పై నియంత్రణ అవసరమని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు మరికొందరు నెటిజన్లు. నాలుగు గోడల మధ్య జరగాల్సిన శోభనాన్ని వీడియో తీయడమే కాకుండా ప్రపంచానికి చూపించడం ఏంటని కొందరు సీరియస్ అవుతున్నారు. లైక్స్ కోసం మరీ ఇంతలా దిగజారిపోవాలా అని కసురుకుంటున్నారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

Formula E Race Case: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్

Allu Arjun Reacts on Sri Tej Health: శ్రీ తేజ్ ఆరోగ్యంపై స్పందించిన అల్లు అర్జున్, ఆ కార‌ణాల‌తోనే అత‌న్ని క‌లువ‌లేక‌పోతున్నా.. అంటూ పోస్ట్