Video: వీడియో ఇదిగో, పోలీస్ స్టేషన్‌లోనే మందేసి చిందేసి 5 గురు పోలీసులు రచ్చ రచ్చ, క్లిప్ వైరల్ కావడంతో అయిదుగురిని విధుల నుంచి సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

వీరంతా పోలీస్‌ స్టేషన్‌లో మద్యం తాగుతూ చిందులేశారు.

Police Dance Video (Photo-Video Grab)

జార్ఖండ్ రాష్ట్రంలో హోలీ రోజున పోలీసులు స్టేషన్ లోనే మందేసి చిందేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. వీరంతా పోలీస్‌ స్టేషన్‌లో మద్యం తాగుతూ చిందులేశారు. జార్ఖండ్‌ రాష్ట్రంలోని గొడ్డా జిల్లాలో మార్చి 9వ తేదీన హోలీ సందర్భంగా కొంతమంది పోలీసులు సివిల్‌ దుస్తులు ధరించి పోలీస్‌ స్టేషన్‌ క్యాంపస్‌లో మద్యం సేవించారు. అంతటితో ఆగకుండా తాగిన మైకంలో ఒళ్లు మర్చిపోయి డ్యాన్స్‌ చేశారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడం.. ఈ విషయం ఉన్నతాధికారులకు చేరడంతో వెంటనే చర్యలు చేపట్టారు.

మారణాయుధాలతో తమన్నా రౌడీ గ్యాంగ్ హల్‌చల్, సిగరెట్‌ తాగుతూ.. వీడియోలు ఫోజులు ఇచ్చిన లేడీ కోసం వెతుకుతున్న కోయంబత్తూర్‌ పోలీసులు

ఈ ఘటనపై విచారణ జరిపినట్లు ఎస్పీ నాటు సింగ్‌ మీనా తెలిపారు. విచారణలో అధికారులు నిబంధనలు అతిక్రమించి ప్రవర్తించినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. దీంతో అయిదుగురు పోలీసు అధికారులను విధుల నుంచి తక్షణమే తొలగిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

Here's Viral Video

సస్పెండ్‌ అయిన వారిలో ఇద్దరు ఏఎస్సైలు ముగ్గురు కానిస్టేబుల్స్‌ ఉన్నారు. ఇదే వీడియోను జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి బాబు లాల్ మరాండీ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif