Beard Hatao: గడ్డం లేని బాయ్‌ఫ్రెండ్ కావాలి, ఇండోర్‌లో అమ్మాయిల వినూత్న నిరసన..వైరల్‌గా మారిన వీడియో

ఇండోర్ అమ్మాయిలు వినూత్న నిరసన చేపట్టారు. అందంగా కనిపించేందుకు అబ్బాయిల్లో కొందరు చిన్నగా గడ్డం పెంచడం ఫ్యాషన్ గా భావిస్తుండగా మరికొందరు గడ్డం తీసేసి క్లీన్ షేవ్ తో కనబడేందుకు ఆసక్తి చూపుతున్నారు. అమ్మాయిల్లో కొందరు గడ్డంతో ఉండే అబ్బాయి లను ఇష్టపడితే, మరికొందరు క్లీన్ షేవ్ తో ఉండే అబ్బాయిలను కోరుకుంటారు. అయితే తాజాగా ఇండోర్ లోని ఓ అమ్మాయిల బృందం మాత్రం గడ్డం లేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలి అంటూ, వీధుల్లో ర్యాలీ తీసి మరి తమ అభిప్రాయాన్ని బహిరంగంగా చాటడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Video No Clean Shave, No Love...Indore Girls Unique Protest Goes Viral(video grab)

Hyd, Oct 20:  ఇండోర్ అమ్మాయిలు వినూత్న నిరసన చేపట్టారు. అందంగా కనిపించేందుకు అబ్బాయిల్లో కొందరు చిన్నగా గడ్డం పెంచడం ఫ్యాషన్ గా భావిస్తుండగా మరికొందరు గడ్డం తీసేసి క్లీన్ షేవ్ తో కనబడేందుకు ఆసక్తి చూపుతున్నారు. అమ్మాయిల్లో కొందరు గడ్డంతో ఉండే అబ్బాయి లను ఇష్టపడితే, మరికొందరు క్లీన్ షేవ్ తో ఉండే అబ్బాయిలను కోరుకుంటారు. అయితే తాజాగా ఇండోర్ లోని ఓ అమ్మాయిల బృందం మాత్రం గడ్డం లేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలి అంటూ, వీధుల్లో ర్యాలీ తీసి మరి తమ అభిప్రాయాన్ని బహిరంగంగా చాటడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

కృత్రిమ గడ్డం పెట్టుకున్న కొందరు అమ్మాయిలు ఇండోర్ వీధుల్లో అబ్బాయిల గడ్డానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. నో క్లీన్ షేవ్.. నో లవ్, గడ్డం లేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలి గడ్డాన్ని అయినా వదులుకో లేదా గర్ల్‌ఫ్రెండ్‌ను అయినా వదులుకో అంటూ...నో క్లీన్ షేవ్.. నో గర్ల్‌ఫ్రెండ్ అంటూ ఆ ఫ్లకార్డుల మీద అమ్మాయిలు నినాదాలు రాసుకుని వీధుల్లో తిరిగారు. ఆ అమ్మాయిల నిరసనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ప్రియుడిని ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసిన ప్రియురాలు, ఇంట్లో వారు రావడంతో అడ్డంగా దొరికిపోయింది..వీడియో ఇదిగో

Here's Video:

 

View this post on Instagram

 

A post shared by ghantaa (@ghantaa)

ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో స్పందిస్తున్నారు.. మా గడ్డం.. మా ఇష్టం, మా గడ్డంతో అమ్మాయిలకు సమస్య ఏంటి, అని అబ్బాయిలు కామెంట్లు పెడుతున్నారు. గడ్డం గీసుకోండి.. ప్రేమలో పడండంటూ ఇండోర్ కాలేజ్ అమ్మాయిల వింత నిరసన తెలపడంతో అబ్బాయిల గడ్డంతో అమ్మాయిలకు ఏమైనా పనా? అంటున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement