NCRB Crime Report: మహిళలపై నేరాల్లో భర్తల హింసే ఎక్కువ.. హత్యల్లో లవ్ ఎఫైర్లది మూడో స్థానం.. ఎన్‌సీఆర్‌బీ సంచలన రిపోర్ట్
2022లో మహిళలపై నేరాలు 4 శాతం మేర పెరిగాయని నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. భర్త లేదా అతడి బంధువుల క్రూరత్వమే మహిళలపై నేరాలలో అధికమని పేర్కొంది.
Newdelhi, Dec 5: 2022లో మహిళలపై (Women) నేరాలు 4 శాతం మేర పెరిగాయని నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ-NCRB) వెల్లడించింది. భర్త లేదా అతడి బంధువుల క్రూరత్వమే మహిళలపై నేరాలలో అధికమని పేర్కొంది. ఇక పిల్లలపైనా నేరాలు అధికమవుతున్నాయని, 2022లో నేరాలు ఏకంగా 8.7 శాతం మేర పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసింది. 2022 ఏడాదిలో దేశవ్యాప్తంగా 58,24,946 కేసులు నమోదయ్యాయి. అంతక్రితం ఏడాదితో పోల్చితే ఇది 4.5 శాతం ఎక్కువగా ఉంది. మొత్తం హత్యల్లో ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన కారణాలు మూడో స్థానంలో నిలిచాయి.
ఎన్‌సీఆర్‌బీ డేటాలో ఇతర కీలక అంశాలు..
- దాడులకు సంబంధించిన కేసులు 2002లో 5.3 శాతం మేర పెరిగాయి.
- సీనియర్ సిటిజన్లు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి వ్యక్తులపై నేరాలు గణనీయంగా పెరిగాయి.
- ఐపీసీ, ప్రత్యేక స్థానిక చట్టాల కింద నమోదవుతున్న కేసుల సంఖ్య కాస్త క్షీణించింది.
- హత్య కేసులు 2.6 శాతం మేర స్వల్పంగా తగ్గాయి.
- ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు వరుసగా 11.1 శాతం, 24.4 శాతం మేర పెరిగాయి.
- మానవ అక్రమ రవాణా కేసులు 2.8 శాతం పెరిగాయి.
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Health Tips: ఫుల్ మఖానను ఎట్టి పరిస్థితుల్లో ఈ జబ్బులో ఉన్నవారు తినకూడదు తింటే చాలా ప్రమాదం
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement