Shreyas Talpade: షూటింగ్‌ ముగించుకొని ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే ప్రముఖ బాలీవుడ్‌ నటుడికి గుండెపోటు, ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం

దీంతో కుటుంబసభ్యులు అతడిని హుటాహుటిన అంధేరీలోని బెల్లెవో ఆసుపత్రికి తరలించారు

Heart Attack. (Photo Credits: Pixabay)

Actor Shreyas Talpade suffers heart attack: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు శ్రేయాస్‌ తల్పాడే (Shreyas Talpade) (47) ముంబైలో షూటింగ్‌ ముగించుకొని ఇంటికి వెళ్లిన తర్వాత గురువారం సాయంత్రం ఒక్కసారిగా గుండె నొప్పితో కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు అతడిని హుటాహుటిన అంధేరీలోని బెల్లెవో ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వైద్యుల పరిశీలనలో ఉన్నాడని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

హిందీ, మరాఠీ సినిమాల్లో నటించిన తల్పాడే మంచి గుర్తింపు పొందాడు. ‘ఇక్బాల్’, గోల్‌మాల్‌ రిటర్న్‌, ఓం శాంతి ఓం, హౌస్‌ఫుల్ – 2 వంటి పలు హిట్ చిత్రాల్లో నటించి ప్రశంసలు పొందాడు. ప్రస్తుతం ‘వెల్‌ కమ్‌ 3’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్స్‌ అక్షయ్ కుమార్, దిశా పటానీ, సునీల్ శెట్టి, పరేష్ రావల్, రవీనా టాండన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సంజయ్ దత్, రాజ్‌పాల్ యాదవ్, కికు శారదా, దలేర్ మెహందీ, మికా సింగ్, రాహుల్ దేవ్, ముఖేష్ తివారీ, షరీబ్ హష్మీ తదితరులు నటిస్తున్నారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)