Amitabh Bachchan on Srivalli Song: వీడియో ఇదిగో, పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్‌ వైరల్ కావడంపై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు, సంతోషం వ్యక్తం చేస్తున్న బన్నీ ఫ్యాన్స్

పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్‌ మీద బిగ్ బీ అమితాబ్ క్రేజీ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి 15వ సీజన్‌కు హౌస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో అల్లు అర్జున్‌ పుష్ప సినిమాకు సంబంధించిన ఓ ప్రశ్న వేశాడు అమితాబ్‌.

amitabh-bachchan

పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్‌ మీద బిగ్ బీ అమితాబ్ క్రేజీ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి 15వ సీజన్‌కు హౌస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో అల్లు అర్జున్‌ పుష్ప సినిమాకు సంబంధించిన ఓ ప్రశ్న వేశాడు అమితాబ్‌. ఈ సందర్భంగా పుష్ప చిత్రం గురించి, అందులోని శ్రీవల్లీ పాటకు బన్నీ వేసిన స్టెప్పు గురించి మాట్లాడుతూ.. 'పుష్ప మూవీ నిజంగా అద్భుతం. ఇంకా శ్రీవల్లి సాంగ్ ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. హీరో డ్యాన్స్ చేస్తూ చెప్పు వదిలేసినా సీన్ కూడా.. ఇంతలా వైరల్ కావడం నా కెరీర్‌లో ఇదే మొదటిసారి చూశా. ఆ స్టెప్పును చాలా మంది అనుకరించారు. ఎక్కడ పడితే అక్కడ ఆ స్టెప్‌ వేసి.. చెప్పులు వదిలేసి మరీ వేసుకునే వారు' అంటూ అమితాబ్ నవ్వారు. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీడియో ఇదిగో..

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement