Varma Meets Perni Nani: ఏపీ మంత్రి పేర్ని నానితో ముగిసిన వర్మ భేటీ, ఒక ఫిల్మ్ మేకర్ గా నా అభిప్రాయాలు షేర్ చేసుకున్నానని తెలిపిన దర్శకుడు వర్మ
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఏపీ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని భేటీ ముగిసింది. మంత్రి పేర్ని నానితో సమావేశానికి ముందుకు ఆర్జీవీ మీడియాతో ముచ్చటించాడు. ఒక ఫిల్మ్ మేకర్ గా నా అభిప్రాయాలు మంత్రిగారితో షేర్ చేసుకోవడానికి వచ్చాని వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఏపీ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని భేటీ ముగిసింది. మంత్రి పేర్ని నానితో సమావేశానికి ముందుకు ఆర్జీవీ మీడియాతో ముచ్చటించాడు. ఒక ఫిల్మ్ మేకర్ గా నా అభిప్రాయాలు మంత్రిగారితో షేర్ చేసుకోవడానికి వచ్చాని వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భేటీకి ముందు ఇక్కడికి తాను సినీ పెద్దల కామెంట్స్, లేఖలపై స్పందించేందుకు రాలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారిదని, నాగార్జున వ్యాఖ్యలపై కానీ, లేఖలు, ఇతరత్రా కామెంట్స్‌పై మాట్లాడేందుకు తాను రాలేదన్నాడు. కేవలం సినీ దర్శకుడిగానే మంత్రి పేర్నీ నానిని కలుస్తున్నానని, సినిమా టికెట్ల ధరల అంశంపై తన అభిప్రాయం ప్రభుత్వానికి తెలియజేస్తానని తెలిపాడు. ఫైనల్ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని ఆర్జీవీ వ్యాఖ్యానించాడు. కాగా నేడు(సోమవారం) ఉదయం వర్మ హైదరాబాద్ నుంచి విజయవాడకు విమానంలో వెళ్లి అక్కడి నుంచి కారులో అమరావతి చేరుకున్నాడు.