Grammys 2024: స్టేజీ మీద మూడు గ్రామీ అవార్డులు అందుకున్న వెంటనే చేతులకు బేడీలు, ప్రముఖ ర్యాప్ సింగర్ కిల్ల‌ర్ మైక్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, వీడియో ఇదిగో..

అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో నేడు జరిగిన గ్రామీ అవార్డుల ప్ర‌దానోత్సవంలో ర్యాప‌ర్ కిల్ల‌ర్ మైక్(Rapper Mike) మూడు అవార్డులు గెలుచుకున్నాడు.అయితే స్టేజ్‌పై అవార్డులు అందుకున్న త‌ర్వాత అత‌న్ని అక్క‌డ ఉన్న సెక్యూరిటీ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.

Killer Mike (Photo Credits: X)

అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో నేడు జరిగిన గ్రామీ అవార్డుల ప్ర‌దానోత్సవంలో ర్యాప‌ర్ కిల్ల‌ర్ మైక్(Rapper Mike) మూడు అవార్డులు గెలుచుకున్నాడు.అయితే స్టేజ్‌పై అవార్డులు అందుకున్న త‌ర్వాత అత‌న్ని అక్క‌డ ఉన్న సెక్యూరిటీ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ప్ర‌వ‌ర్త‌న స‌రిగా లేని కార‌ణంగా 243(ఏ) పీసీ కింద అత‌న్ని అరెస్టు చేశారు.

ఒక‌వైపు మ్యూజిక్ అవార్డ్స్ షో కొన‌సాగుతుండ‌గానే.. అత‌ని చేతుల‌కు బేడీలు వేసి పోలీసులు తీసుకువెళ్లారు.ప్ర‌స్తుతం అత‌ను లాస్ ఏంజిల్స్ పోలీసులు ఆధీనంలో ఉన్నాడు. కాగా బెస్ట్ ర్యాప్ ఆల్బ‌మ్‌, బెస్ట్ ర్యాప్ సాంగ్, బెస్ట్ ర్యాప్ ప‌ర్ఫార్మెన్స్ కేట‌గిరీల్లో ర్యాప‌ర్ మైక్ అవార్డులు గెలుచుకున్నాడు. సామాజిక న్యాయం, జాత్యహంకారం, న‌ల్ల‌వారికి చెందిన స‌మ‌స్య‌ల గురించి ర్యాపర్ మైక్ త‌న పాట‌ల్లో ఎక్కువగా పాడేవాడు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement