James: వీ మిస్ యూ సర్, పునీత్ రాజ్ కుమార్‌పై ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన ప్రభాస్, మార్చి 17న విడుదలకు సిద్ధమైన పునీత్ చివరి చిత్రం జేమ్స్
ఈ పోస్ట్‌లో ప్రభాస్ ‘‘జేమ్స్’ రూపంలో మనం అద్భుతమైన కళాఖండాన్ని చూడబోతున్నాం.
దివంగత కన్నడ పవర్ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం 'జేమ్స్' విడుదల సిద్దమవుతోంది. మార్చి 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న జేమ్స్ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ నేపథ్యంలో పునీత్‌ను గుర్తు చేసుకుంటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు.ఈ సందర్భంగా జేమ్స్ మూవీలోని పునీత్ పోస్టర్‌ను షేర్ చేశాడు ప్రభాస్. ఈ పోస్ట్‌లో ప్రభాస్ ‘‘జేమ్స్’ రూపంలో మనం అద్భుతమైన కళాఖండాన్ని చూడబోతున్నాం. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సర్‌ని అభిమానించే లక్షలాది మందికి ఈ చిత్రం ఎప్పుడూ ప్రత్యేకమైనదే. వీ మిస్ యూ సర్’’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)