
Hyderabad, FEB 26: సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని (Posani Arrest) పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం మైహోం భుజా అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న పోసానిని ఏపీలోని రాయచోటి పోలీసులు (Rayachoti Police) అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు పోసాని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Posani Krishna Murali Arrested
బిగ్ బ్రేకింగ్ న్యూస్
నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్
పోసానిని ఇంట్లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు https://t.co/54cZnlnXYi pic.twitter.com/Xc57Gb57QM
— Telugu Scribe (@TeluguScribe) February 26, 2025
అయితే గతంలో వైఎస్సార్‌సీపీలో పనిచేసిన ఆయన...ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్‌తో పాటూ పలువురు కూటమి నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానీ పోసాని అరెస్టుకు గల కారణాలు తెలియరాలేదు.
అయితే పోసానికి ఆరోగ్యం బాగా లేదని ఆయన సతీమణి చెప్పిన కూడా పోలీసులు పట్టించుకోలేదు. ఆరోగ్యం బాగోలేదన్నా కూడా అనంతపురం పోలీసులు దురుసుగా వ్యవహరించారని ఆయన సతీమణి చెప్తున్నారు.