Jani Master on Rape Allegations: వీడియోలు ఇవిగో, చంచలగూడ జైలుకు జానీ మాస్టర్, వీడియోలు తీయకండి అంటూ రిక్వెస్ట్..

లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది ఉప్పరపల్లి కోర్టు. దీంతో జానీ మాస్టర్‌ను చంచలగూడ జైలుకు తరలించారు. కొరియోగ్రాఫర్ జానీ పోలీసుల విచారణలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Jani Master (Photo-X/Screengrab)

లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది ఉప్పరపల్లి కోర్టు. దీంతో జానీ మాస్టర్‌ను చంచలగూడ జైలుకు తరలించారు. కొరియోగ్రాఫర్ జానీ పోలీసుల విచారణలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదు. కావాలనే కొందరు నాపై తప్పుడు కేసు పెట్టించారు. న్యాయపరంగా పోరాడి నిజాయితీ నిరూపించుకుంటా. నన్ను కేసులో ఇరికించిన వారిని వదిలిపెట్టను’’ అని అన్నారని తెలుస్తోంది.

జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్, చంచలగూడ జైలుకు తరలింపు, కావాలనే తనను ఇరికించారన్న జానీ మాస్టర్!

అక్టోబర్‌ 3 వరకు ఆయన చంచల్‌గూడ జైలులో ఉండనున్నారు. గత నాలుగైదు రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్‌ను గోవాలోని ఓ లాడ్జిలో నార్సింగి స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన్ను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచగా న్యాయస్థానం రిమాండ్‌ విధించింది.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement