Abhinav Singh Dies: భార్య వేధింపులు తట్టుకోలేక ప్రముఖ సింగర్ అభినవ్‌ సింగ్‌ ఆత్మహత్య, విషం తాగి చనిపోయాడని తెలిపిన ఒడిశా ర్యాపర్‌ కుటుంబ సభ్యులు

భార్య వేధింపులు తట్టుకోలేక ప్రముఖ సింగర్‌, ర్యాపర్‌ (Odia Rapper) అభినవ్‌ సింగ్‌ (Abhinav Singh) ఆత్మహత్య చేసుకున్నాడు. ఒడిశాకు చెందిన ర్యాపర్‌ అభినవ్‌ సింగ్‌ (32) బెంగళూరులోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వేధింపులు తాళలేక విషం తాగి చనిపోయాడని అతడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు

భార్య వేధింపులు తట్టుకోలేక ప్రముఖ సింగర్‌, ర్యాపర్‌ (Odia Rapper) అభినవ్‌ సింగ్‌ (Abhinav Singh) ఆత్మహత్య చేసుకున్నాడు. ఒడిశాకు చెందిన ర్యాపర్‌ అభినవ్‌ సింగ్‌ (32) బెంగళూరులోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వేధింపులు తాళలేక విషం తాగి చనిపోయాడని అతడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. తన కుమారుడి చావుకు కోడలు సహా ఆమె కుటుంబసభ్యులే కారణమంటూ సింగర్‌ తండ్రి బిజయ్‌ నందా సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

భైరవద్వీపం మూవీ విలన్ విజయ్ రంగరాజు కన్నుమూత, గుండెపోటుకు గురై మృతి చెందిన గోపీచంద్ మూవీ యజ్ఞం నటుడు

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అభినవ్‌ ఒడియా ర్యాప్‌ సాంగ్స్‌తో ఫేమస్‌ అయ్యాడు. కథక్‌ ఆంథెమ్‌ సాంగ్‌తో మరింత పాపులర్‌ అయ్యాడు. ఇతడు అర్బన్‌ లోఫర్‌ అనే మొదటి హిప్‌ హాప్‌ లేబుల్‌ను స్థాపించాడు.

Odia Rapper Abhinav Singh Aka Juggernaut Dies by Suicide

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now