Pawan Kalyan in Insta: ఇన్ స్టాగ్రామ్ లో పవన్ కల్యాణ్ మొదటి పోస్టు.. తన సినీ కెరీర్ లోని వ్యక్తులతో అద్భుత వీడియో.. మన బంధం ఇలాగే కొనసాగాలంటూ క్యాప్షన్

పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ లో ఖాతా తెరిచారు. ఆయన ఒక్క పోస్టు పెట్టకుండానే మిలియన్లకొద్దీ వ్యూయర్స్ వాలిపోయారు. కాగా, పవన్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తొలి పోస్టు పెట్టారు.

Credits: Twitter

Hyderabad, July 16: పవర్ స్టార్ (Powerstar), జనసేనాని (Janasena) పవన్ కల్యాణ్ (Pawan kalyan)  ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ (Instagram) లో ఖాతా తెరిచారు. ఆయన ఒక్క పోస్టు పెట్టకుండానే మిలియన్లకొద్దీ వ్యూయర్స్ (Viewers) వాలిపోయారు. కాగా, పవన్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తొలి పోస్టు పెట్టారు. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధంలేని రీతిలో పూర్తిగా సినిమా వాళ్లతోనే ఈ పోస్టు ముడిపడి ఉండటం గమనార్హం. తాను సినీ కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇండస్ట్రీలో ఎవరెవర్ని కలిశారో, వారందరితో అనుబంధాన్ని చాటేలా ఉన్న ఫొటోలతో ఓ వీడియోను రూపొందించిన పవన్... ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు పేరిట దాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Nithya Menen: స్టార్ హీరోయిన్ నిత్య మేనన్ ఇంట్లో పెను విషాదం.. నిత్య అమ్మమ్మ మృతి.. సోషల్ మీడియాలో వెల్లడి.. ఒక శకం ముగిసిందంటూ తీవ్ర భావోద్వేగం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now