Prabhas Fan Dies: సలార్ రిలీజ్ వేళ విషాదం, ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్‌తో అభిమాని మృతి, మృతుడు కుటుంబాన్ని ఆదుకోవాలంటూ బంధువులు ఆందోళన
ధర్మవరంలో థియేటర్ వద్ద ప్రమాదవశాత్తూ ఓ వీరాభిమాని మృతి చెందాడు. పట్టణ కేంద్రంలోని రంగా సినిమా థియేటర్‌లో 'సలార్' సినిమా విడుదల సందర్భంగా బాలరాజు(27) థియేటర్ ఆవరణలో సలార్ మూవీ బ్యానర్ కడుతున్నాడు.
సలార్ మూవీ రిలీజ్ నేపథ్యంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. ధర్మవరంలో థియేటర్ వద్ద ప్రమాదవశాత్తూ ఓ వీరాభిమాని మృతి చెందాడు. పట్టణ కేంద్రంలోని రంగా సినిమా థియేటర్‌లో 'సలార్' సినిమా విడుదల సందర్భంగా బాలరాజు(27) థియేటర్ ఆవరణలో సలార్ మూవీ బ్యానర్ కడుతున్నాడు.
ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఫ్లెక్సీ రాడ్ పైనున్న హై వోల్టేజ్ తీగలకు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే దగ్గరలోని హాస్పిల్‌కి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు బంధువులు, ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ వద్ద న్యాయం చేయాలంటూ, మృతి చెందిన బాలరాజు కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఆందోళన చేపట్టారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)