
Jaipur, Mar 8: ఓ హోటల్లో (Hotel) భోజనం చేసిన తర్వాత బిల్లు చెల్లిస్తుండగా ఓ యువకుడికి గుండెపోటు (Heart Attack) వచ్చింది. దీంతో కౌంటర్ వద్దే కుప్పకూలిపోయాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ రాజ్ సమంద్ లోని హోటల్ లో సచిన్ (27) అనే యువకుడు ఇటీవల భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత బిల్లు చెల్లిస్తుండగా సచిన్ కు గుండెపోటు వచ్చింది. దీంతో సడెన్ గా కౌంటర్ వద్దే కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Here's Video:
బిల్లు చెల్లిస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి..
రాజస్థాన్లోని ఓ హోటల్లో భోజనం చేసిన తర్వాత బిల్లు చెల్లిస్తుండగా సచిన్ (27) అనే యువకుడికి గుండెపోటు వచ్చింది. దీంతో కౌంటర్ వద్దే కుప్పకూలిపోయాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. pic.twitter.com/wUKyqVyprS
— ChotaNews App (@ChotaNewsApp) March 7, 2025
అమెరికాలో మరో తెలుగు యువకుడు
అమెరికాలో మరో తెలుగు యువకుడు మృతిచెందాడు. గుండెపోటుతో హనుమకొండ జిల్లాకు చెందిన ఏరుకొండ రాజేశ్ (32) మరణించాడు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన ఏరుకొండ రాజేశ్ ఉన్నత చదువుల కోసం తొమ్మిదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అక్కడే రాజేశ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో గుండెపోటుతో అస్వస్థతకు గురైన రాజేశ్ మూడు రోజుల క్రితం మరణించాడు.