
Kamareddy, Feb 22: పెండ్లి పందిట్లో కూతురి పెండ్లి (Wedding) జరిపిస్తున్న ఆ తండ్రి గుండె ఒక్కసారిగా ఆగిపోయిన విషాదకర ఘటన (Bride Father Died) కామారెడ్డిలో శుక్రవారం చోటు చేసుకున్నది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన కుడిక్యాల బాల చంద్రం (56) వృత్తి రీత్యా కామారెడ్డిలో స్థిరపడ్డాడు. ఆయనకు భార్య రాజమణి, ఇద్దరు కుమార్తెలు. జ్ఞాపకశక్తి పోటీల్లో ఇద్దరు కూతుళ్లు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాచారు. కాగా పెద్ద కుమార్తె కనకమహాలక్ష్మి వివాహం బెంగళూరుకు చెందిన రాఘవేంద్రతో ఇటీవల నిశ్చయించారు. ఈ క్రమంలో జంగంపల్లి శివారులోని బీటీఎస్ వద్ద ఓ కల్యాణ మండపంలో శుక్రవారం పెద్ద కుమార్తె వివాహ ఏర్పాట్లు వైభవంగా చేశారు.
కన్యాదానం చేసిన కొద్దిసేపటికే..
అయితే కన్యాదానం చేసిన కొద్దిసేపటికే వధువు తండ్రి బాల్ చంద్ర కల్యాణ మండపంలోనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఈ హఠాత్పరిణామంతో దిగ్భాంతికి గురైన బంధువులు వెంటనే ఆయనను గోప్యంగా జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో పెండ్లి ఆగిపోవద్దన్న ఉద్దేశంతో బంధువులు తండ్రి మరణవార్త చెప్పకుండానే కొండంత దుఃఖంతోనే వివాహ క్రతువును పూర్తి చేయించారు. ఆ తర్వాత బాల చంద్రం కన్నుమూసిన వార్త తెలియడంతో ఒక్కసారిగా ఫంక్షన్ హాల్ లో విషాదఛాయలు ఆవరించాయి.
ఫ్రీగా చికెన్ ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్, హైదరాబాద్ ఉప్పల్‌లో ఎగబడ్డ జనం, గంటలోనే 2500 గుడ్లు ఖతం