Free Chicken Distribution in Uppal

Hyderabad, FEB 21: ప్రస్తుతం చికెన్ ప్రియులను బర్డ్ ఫ్లూ (BirdFlu) భయం వెంటాడుతోంది. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ కు దూరమయ్యారు. కోడి కూర తింటే ఎక్కడ ఏ రోగం వస్తుందోనని బెంబేలెత్తిపోతున్నారు. అందుకే, చికెన్ తినడం మానేశారు. ఇక, కొందరు కోడి గుడ్లను చూసినా వణికిపోతున్నారు. బర్డ్ ఫ్లూ భయంతో వాటిని కూడా తినడం మానేశారు. ఈ క్రమంలో చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. చికెన్ కొనే వాళ్లు లేక వ్యాపారులు, పౌల్ట్రీ రైతులు లబోదిబోమంటున్నారు. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్, ఎగ్స్ తినేందుకు జనం జంకుతున్న వేళ.. దీనిపై అవగాహన కల్పించేందుకు పలు పౌల్ట్రీ సంస్థలు ముందుకు వచ్చాయి. చికెన్, గుడ్లు తింటే ఏమీ అవ్వదు అనే భరోసా కల్పించే ప్రయత్నంలో భాగంగా ఫ్రీ చికెన్, ఎగ్ మేళాలు నిర్వహిస్తున్నాయి.

Bandi Sanjay: LRS పేరుతో రూ.50వేల కోట్ల దోపిడీకి సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్.. ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్ చేస్తామని డబ్బులు వసూలు చేస్తారా? అని బండి సంజయ్ ఫైర్ 

హైదరాబాద్ ఉప్పల్ గణేశ్ నగర్ లో ఫ్రీగా చికెన్ ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్ ను అందించింది ఓ పౌల్ట్రీ సంస్థ. ఈ మేళాకు భారీగా జనం తరలివచ్చారు. ఉచితంగా ఇస్తున్న చికెన్ ఫ్రై, ఎగ్స్ కోసం జనాలు ఎగబడ్డారు. ఈ మేళాకు జనం ఏ రేంజ్ లో జనం వచ్చారంటే.. అర కిలోమీటర్ దాకా క్యూలైన్ ఫామ్ అయ్యిందంటే అర్థం చేసుకోవచ్చు. క్యూలో నిలబడి మరీ చికెన్, ఎగ్స్ తీసుకెళ్లారు జనాలు. మేళా స్టార్ట్ చేసిన కాసేపటిలోగానే 25 కిలోల చికెన్ ఫ్రై, 2500 బాయిల్డ్ ఎగ్స్ ఖతమయ్యాయి.