Free Chicken Distribution In Guntur (Credits: X)

Guntur, Feb 22: బర్డ్ ఫ్లూ (Bird flu) భయంతో చికెన్ అమ్మకాలు అంతకంతకూ పడిపోతున్నాయి. కోడి కూర (Chicken Curry) తింటే ఎక్కడ ఆ రోగం వస్తుందోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అందుకే, చికెన్ తినడం మానేశారు. దీంతో అమ్మకాలు లేక వ్యాపారాలు లబోదిబోమంటున్నారు. చికెన్ తినడం వల్ల ఏమీ కాదని.. వైద్య నిపుణులు చెప్తున్నా.. ప్రజలు మాత్రం ఇంకా భయంతోనే ఉన్నారు. చికెన్ కర్రీని, గుడ్లను 100 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఉడికిస్తామని, అయితే, 70 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత దాటితే వైరస్ చనిపోతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నా బర్డ్ ఫ్లూ భయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో దీనిపై అవగాహన కల్పించేందుకు పలు పౌల్ట్రీ సంస్థలు ముందుకు వచ్చాయి. చికెన్, గుడ్లు తింటే ఏమీ అవ్వదు అనే భరోసా కల్పించే ప్రయత్నంలో భాగంగా ఫ్రీ చికెన్, ఎగ్ మేళాలు నిర్వహిస్తున్నాయి. శుక్రవారం హైదరాబాద్ లోని ఉప్పల్ లో నిర్వహించినట్టే ఏపీలోని గుంటూరులోనూ ఓ పౌల్ట్రీ సంస్థ చికెన్ మేళా నిర్వహించింది. ఫ్రీగా వండిన చికెన్ ను వేడివేడిగా తినడానికి జనాలు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఫ్రీగా చికెన్‌ ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్‌, హైదరాబాద్‌ ఉప్పల్‌లో ఎగబడ్డ జనం, గంటలోనే 2500 గుడ్లు ఖతం

హైదరాబాద్ లోనూ..

ఇక, శుక్రవారం హైదరాబాద్ ఉప్పల్ గణేశ్ నగర్ లో ఓ పౌల్ట్రీ సంస్థ ఫ్రీగా చికెన్ ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్ ను అందించింది. ఈ మేళాకు భారీగా జనం తరలివచ్చారు. ఉచితంగా ఇస్తున్న చికెన్ ఫ్రై, ఎగ్స్ కోసం జనాలు ఎగబడ్డారు. అర కిలోమీటర్ దాకా క్యూలైన్ ఫామ్ అవడంతో కొంత ట్రాఫిక్ ఏర్పడింది. మేళా స్టార్ట్ చేసిన కాసేపటిలోగానే 25 కిలోల చికెన్ ఫ్రై, 2500 బాయిల్డ్ ఎగ్స్ అయిపోయాయి.

LRS పేరుతో రూ.50వేల కోట్ల దోపిడీకి సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్.. ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్ చేస్తామని డబ్బులు వసూలు చేస్తారా? అని బండి సంజయ్ ఫైర్