Producer Dil Raju: వీడియో ఇదిగో, నాపై తప్పుడు వార్తలు రాసే వారి తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చిన నిర్మాత దిల్ రాజు

హైదారాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లోని జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో మాట్లాడిన దిల్‌రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కొందరికి వార్నింగ్ కూడా ఇచ్చారు. 'ఇండస్ట్రీలో పక్కన ఉంటూనే మనపై రాళ్లు వేస్తారు. ప్రతి సంక్రాంతికి సినిమాలు విడుదలవుతుంటాయి.

Producer Dil Raju (Photo-Video Grab)

హైదారాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లోని జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో మాట్లాడిన దిల్‌రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కొందరికి వార్నింగ్ కూడా ఇచ్చారు. 'ఇండస్ట్రీలో పక్కన ఉంటూనే మనపై రాళ్లు వేస్తారు. ప్రతి సంక్రాంతికి సినిమాలు విడుదలవుతుంటాయి. అప్పుడు ఏదో ఓ రకంగా నాపై ప్రతి సంక్రాంతికి విమర్శలు చేస్తున్నారు. 'హనుమాన్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి నా గురించి మాట్లాడిన మాటలని కొన్ని వెబ్‌సైట్లు తప్పుగా వక్రీకరించాయి. నాపై తప్పుడు వార్తలు రాస్తే వెబ్ సైట్ల తాటతీస్తా' అని చెప్పారు.

వ్యాపార పరంగా వచ్చే విమర్శలని ఆయా వెబ్‌సైట్స్ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈరోజు నుంచి ఊరుకునే ప్రసక్తే లేదు. తమిళ సినిమాను నేనే వాయిదా వేశాను. హనుమాన్ సినిమా విడుదల చేయాలని నేనే చెప్పాను. నైజాంలో హనుమాన్ , గుంటూరు కారం సినిమాలకు థియేటర్లు ఉన్నాయి. నాగార్జున, వెంకటేశ్ సినిమాలకు మాత్రం థియేటర్లు దొరకడం లేదు. తప్పుడు రాతలతో ఏం చేద్దామనుకుంటున్నారు. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మీ వైబ్‌సైట్లకు నన్ను వాడుకుంటే తాటతీస్తా' అని దిల్‌రాజు హెచ్చరించారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement