#BoycottRRRinKarnataka: ఆర్‌ఆర్‌ఆర్‌కు నిరసన సెగ, క‌ర్ణాట‌క‌లో నిషేధం విధించాల‌ని పెద్ద ఎత్తున డిమాండ్, ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న #BoycottRRRinKarnataka హ్యాష్‌ట్యాగ్

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఎల్లుండి విడుద‌ల అవుతున్న విష‌యం తెలిసిందే. ప‌లు భాష‌ల్లో ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. అయితే, సోషల్‌ మీడియాలో కన్నడిగులు ఈ సినిమాపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

RRR Movie Release Date (Photo Credits: Twitter)

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఎల్లుండి విడుద‌ల అవుతున్న విష‌యం తెలిసిందే. ప‌లు భాష‌ల్లో ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. అయితే, సోషల్‌ మీడియాలో కన్నడిగులు ఈ సినిమాపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ కన్నడ భాషలో విడుద‌ల అవ్వ‌ట్లేద‌ని, త‌మ భాష‌లో ఆ సినిమా విడుద‌ల కాన‌ప్పుడు ఇత‌ర భాష‌ల్లోనూ ఆడ‌కుండా క‌ర్ణాట‌క‌లో నిషేధం విధించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవ‌ల కర్ణాటకలోనూ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. దీనికి క‌ర్ణాట‌క సీఎం బొమ్మై కూడా వ‌చ్చారు. అయిన‌ప్ప‌టికీ, ఈ సినిమాను కన్నడ భాషలో విడుడ‌ల చేయ‌లేక‌పోతుండ‌డంతో ఇది త‌మ భాష‌ను అవమానించడమేనని క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు అంటున్నారు. ఇందుకు సంబంధించిన BoycottRRRinKarnataka హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement