Mallika Rajput Dies: సినీ పరిశ్రమలో ఆగని ఆత్మహత్యలు, ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ శవమై కనిపించిన ప్రముఖ సింగర్ మల్లికా రాజ్‌పుత్

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రముఖ సింగర్ విజయ్ లక్ష్మి అలియాస్ మల్లికా రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతాకుండ్ ప్రాంతంలోని ఆమె ఇంటి గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందని పోలీసులు వెల్లడించారు

Malika Rajput (Photo Credits: Instagram)

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రముఖ సింగర్ విజయ్ లక్ష్మి అలియాస్ మల్లికా రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతాకుండ్ ప్రాంతంలోని ఆమె ఇంటి గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందని పోలీసులు వెల్లడించారు. రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు మల్లిక తల్లి సుమిత్రా సింగ్ తెలిపారు. ప్రాథమికంగా అనుమానాస్పద మృతిగా భావిస్తున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆత్యహత్య? లేదా ఎవరీ పాత్ర అయినా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 35 ఏళ్లకే మల్లికా చనిపోవడంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement