Gayatri Joshi Car Accident Video: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, తృటిలో తప్పించుకున్న బాలీవుడ్ నటి గాయత్రి జోషి ఆమె భర్త వివేక్ ఒబెరాయ్

బాలీవుడ్‌ మూవీ 'స్వదేశ్‌' లో షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించిన యాక్టర్‌ గాయత్రి జోషి ప్రయాణిస్తున్న లగ్జరీ కారు ప్రమాదానికి గురైంది. గాయత్రితోపాటు, భర్త, వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్‌ తృటిలో ఈ ప్రమాదంనుంచి తప్పించుకున్నారు. అయితే మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

Gayatri Joshi Car Accident Video

బాలీవుడ్‌ మూవీ 'స్వదేశ్‌' లో షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించిన యాక్టర్‌ గాయత్రి జోషి ప్రయాణిస్తున్న లగ్జరీ కారు ప్రమాదానికి గురైంది. గాయత్రితోపాటు, భర్త, వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్‌ తృటిలో ఈ ప్రమాదంనుంచి తప్పించుకున్నారు. అయితే మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలో విహార యాత్రలో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

సార్డినియా సూపర్‌కార్ ఎక్స్‌పీరియన్స్ సమయంలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు గాయత్రి ప్రయాణిస్తున్న లంబోర్ఘిని కారు మరో లగ్జరీ కారు ఫెరారీని, క్యాంపర్ వ్యాన్‌ని ఢీకొట్టింది. లంబోర్ఘిని ,ఫెరారీతో సహా ఇతర లగ్జరీ వాహనాలతో పాటు, మినీ ట్రక్కును ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇది జరిగింది. దీంతో ఫెరారీ కారులో ఉన్న స్విట్జర్లాండ్‌కు జంట ప్రాణాలు కోల్పోయారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement