Chiranjeevi: వీడియో ఇదిగో, మా తాత పెద్ద రసికుడు, ఆయన బుద్ధులు నాకు రాకూడదని మా అమ్మ కోరుకునేది, మరోసారి వార్తల్లోకెక్కిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇప్పటికే తన వారసత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న చిరు ఇదే వేడుకలో తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడంతో మరోసారి వైరల్ అవుతున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇప్పటికే తన వారసత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న చిరు ఇదే వేడుకలో తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడంతో మరోసారి వైరల్ అవుతున్నాడు. బ్రహ్మా ఆనందం సినిమా వేడుకలో యాంకర్ సుమ చిరంజీవికి మైక్ ఇచ్చి తన తాత గురించి మాట్లాడమని కోరుతుంది. దీంతో తన తాత పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ మాట్లాడారు.
అమ్మగారి నాన్న, మా తాత రాధాకృష్ణ నాయుడు ఆయన నెల్లురు వాసి అయినప్పటికీ మొగల్తూరులో సెటిల్ అయ్యాడు. మా అమ్మ తరచూ చెప్పేది.. నీకు ఎవరి బుద్ధులు వచ్చినా పర్లేదు కానీ, మీ తాత బుద్ధులు రాకూడదు అని చెప్పుకోచ్చేది. ఎందుకంటే ఆయన మంచి రసికుడు. నాకు ఇద్దరు అమ్మమ్మలు ఉండేవాళ్లు. వీరిద్దరి మీద అలిగితే ఇంకో అమ్మమ్మ దగ్గరికి వెళ్లేవాడు. అంత ఆదర్శప్రాయుడు మా తాట అంటూ ఆయన గురించి చెప్పుకోచ్చారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
నీకు ఎవరి బుద్ధి వచ్చినా పర్వాలేదు మా తాత బుద్దులు రావొద్దని అనే వాళ్లు