Andhra Pradesh: అసని తుఫాను కారణంగా నేడు జరగనున్న ప‌రీక్ష వాయిదా, తిరిగి మే 25, 2022న నిర్వ‌హిస్తామ‌ని ప్రకటించిన బోర్డు

బంగాళఖాతం నుంచి పొంచిఉన్న తీవ్ర తుఫాను అసని కారణంగా ఆంధ్రప్రదేశ్ పరిధిలో బుధవారం జరగనున్న పలు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రకటించింది. బుధవారం జరగాల్సిన ఇంటర్ మొదటి సంవత్సరం గణితం పేపర్ -1ఎ సహా..వృక్షశాస్త్రం, పౌరశాస్త్రం పరీక్షలు వాయిదా వేశారు.

Representational Image | (Photo Credits: PTI)

బంగాళఖాతం నుంచి పొంచిఉన్న తీవ్ర తుఫాను అసని కారణంగా ఆంధ్రప్రదేశ్ పరిధిలో బుధవారం జరగనున్న పలు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రకటించింది. బుధవారం జరగాల్సిన ఇంటర్ మొదటి సంవత్సరం గణితం పేపర్ -1ఎ సహా..వృక్షశాస్త్రం, పౌరశాస్త్రం పరీక్షలు వాయిదా వేశారు. రేపటి ఈ మూడు పరీక్ష మినహా మిగతా పరీక్షలు..బోర్డు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు.వాయిదా ప‌డిన ప‌రీక్ష‌ను మే 25, 2022న నిర్వ‌హిస్తామ‌ని బోర్డు ప్ర‌క‌టించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement