Uttarakhand: వీడియో ఇదిగో, దేవభూమిలో దారుణం, గుర్రానికి బలవంతంగా గంజాయి తాగించిన ఓనర్లు, వీళ్లు మనుషులేనా అంటూ మండిపడుతున్న జంతువుల అభిమానులు

కేదార్‌నాథ్ యాత్రలో ఇద్దరు యువకులు గుర్రానికి బలవంతంగా గంజాయి తాగించేందుకు ప్రయత్నిస్తున్న వీడియో వైరల్‌గా మారింది.ప్రస్తుతం నెట్టంట వైరల్‌గా మారిన వీడియోలో.. ఇద్దరు యువకులు గుర్రం నోరు పట్టుకున్నారు. ఒకరు గుర్రం ముక్కు రంధ్రాలను మూసేశారు

horse smoke weed forcefully

కేదార్‌నాథ్ యాత్రలో ఇద్దరు యువకులు గుర్రానికి బలవంతంగా గంజాయి తాగించేందుకు ప్రయత్నిస్తున్న వీడియో వైరల్‌గా మారింది.ప్రస్తుతం నెట్టంట వైరల్‌గా మారిన వీడియోలో.. ఇద్దరు యువకులు గుర్రం నోరు పట్టుకున్నారు. ఒకరు గుర్రం ముక్కు రంధ్రాలను మూసేశారు. మరొక యువకుడు గుర్రానికి గంజాయిని నాసిక రంధ్రం ద్వారా బలవంతంగా తాగించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఈ వీడియోని చూసిన నెటిజన్లు పలువురు ఘాటుగా స్పందించారు. వీళ్లు మనుషులేనా.. ఇది అమానుషమైన ఘటనని, జంతువులను ఇంత దారుణంగా హింసించే నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఉత్తరాఖండ్ పోలీసులు స్పందిస్తూ.. గుర్రంతో బలవంతంగా గంజాయి తాగిస్తున్న వైరల్ వీడియోను మేము చూశాం. వీడియోలోని వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటామని" చెప్పారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement