Hyderabad: వీడియో ఇదిగో, పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో కాలేజీ 4వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకోబోయిన విద్యార్థిని, కాపాడిన తోటి విద్యార్థులు
హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో తీసుకున్న నిర్ణయం అక్కడ ఉన్నవారిని కాసేపు భయాందోళనకు గురయ్యేలా చేసింది.నగరంలోని పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు ఉమెన్స్ ఇంజనీరిగ్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది.
హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో తీసుకున్న నిర్ణయం అక్కడ ఉన్నవారిని కాసేపు భయాందోళనకు గురయ్యేలా చేసింది.నగరంలోని పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు ఉమెన్స్ ఇంజనీరిగ్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని కీర్తి కాలేజ్ భవనం పైనుంచి కిందకు దూకేందుకు యత్నించింది. క్యాంపస్ పరీక్షలో ఫెయిల్ అవుతానేమో అనే భయంతో కీర్తి నాలుగో ఫ్లోర్ కిటికీ నుంచి దూకబోయింది. వెంటనే అప్రమత్తమైన తోటి విద్యార్థులు.. కీర్తి కిందపడకుండా పట్టుకుని కాపాడారు. విద్యార్థిని సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఈ మధ్య కాలంలో కీర్తీ సెమిస్టర్ ఎగ్జామ్ రాసింది. అయితే ఎగ్జామ్స్ సరిగ్గా రాయకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ నేపథ్యంలో ఫెయిల్ అవుతానేమో అనే భయంతో క్లాస్ రూంలో నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చి నాలుగో అంతస్తులో నుంచి కిందకు దూకేందుకు ప్రయత్నించింది.అప్పటికే గమనించిన తోటి విద్యార్థులు ఆమెను కిందకు దూకకుండా పట్టుకుని రక్షించారు. ప్రస్తుతం విద్యార్థిని క్షేమంగా ఉందని కాలేజీ యాజమాన్యం తెలిపింది.
B.Tech Student Threatens To Commit Suicide by Jumping From 4th Floor of Building