Bihar: ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర, ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న బీహార్ పోలీసులు, ఉగ్ర కుట్రకు పుల్వారి షరీఫ్‌లో శిక్షణ పొందినట్టు తెలిపిన పోలీసులు
ఈ నెల 12న ప్రధాని నరేంద్ర మోదీ బిహార్‌లో పర్యటించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ టార్గెట్‌గా ఉగ్రవాదుల కుట్రను బీహార్ పోలీసులు ఛేదించారు.
ఈ నెల 12న ప్రధాని నరేంద్ర మోదీ బిహార్‌లో పర్యటించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ టార్గెట్‌గా ఉగ్రవాదుల కుట్రను బీహార్ పోలీసులు ఛేదించారు. ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. అనుమానితులను అధర్ పర్వేజ్, మహ్మద్ జలాలుద్దీన్‌లుగా గుర్తించారు. వీరు ప్రధాని పర్యటనకు పదిహేను రోజుల ముందు పుల్వారి షరీఫ్‌లో శిక్షణ పొందినట్టు చెబుతున్నారు.
ప్రధాని మోదీ లక్ష్యంగా వీరు ఈనెల 6,7 తేదీల్లో సమావేశమై ఉగ్ర కుట్రకు పావులు కదిపారని అనధికార సమాచారం. అనుమానిత ఉగ్రవాదుల పుల్వారి షరీఫ్ కార్యాలయంపై బిహార్ పోలీసులు దాడులు నిర్వహించగా పలు పత్రాలు, ఉగ్ర సాహిత్యాన్ని సీజ్ చేశారు.పుల్వారి షరీఫ్ ప్రాంతానికి శిక్షణ కోసం పలు రాష్ట్రాల నుంచి యువత ఇక్కడికి వస్తుంటారని పోలీసులు గుర్తించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ వంటి ఇస్లామిక్ దేశాల నుంచి అరెస్టయిన ఉగ్రవాదులకు నిధులు వస్తుంటాయని పోలీసులు వెల్లడించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)