Viral Video: వీడియో ఇదిగో, తల్లిదండ్రులకు భయపడి ప్రియుడ్ని ట్రంక్ పెట్టెలో దాచిన ప్రియురాలు, ఆ తర్వాత ఏమైందంటే..
బీహార్‌లో కుటుంబ సభ్యులకు భయపడి ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌ను ట్రంకు పెట్టెలో దాచిపెట్టి తాళం వేసింది. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
బీహార్‌లో కుటుంబ సభ్యులకు భయపడి ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌ను ట్రంకు పెట్టెలో దాచిపెట్టి తాళం వేసింది. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వీడియోని చూస్తే ట్రంకు పెట్టెలో ఉండాల్సిన బట్టలు, ఇతర వస్తువులు బయట చిందరవందరగా పడి ఉండటం చూసిన కుటుంబ సభ్యులు అప్పటివరకు ఇంట్లోనే ఉన్న యువతిని నిలదీశారు.
దాంతో యువతి తాను ఏమీ చేయలేదని బుకాయించింది. కానీ, ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో తల్లి, సోదరుడు ట్రంకు పెట్టెను తెరవాల్సిందిగా చెప్పారు. యువతి అందులో ఏం లేదని, తాను తెరవనని చెప్పింది. చివరకు సోదరుడు గట్టిగా చెప్పడంతో ఆమెకు పెట్టె తెరవక తప్పలేదు. అలా సోదరి పెట్టెను ఓపెన్ చేస్తున్న సమయంలో సోదరుడు వీడియో తీశాడు.
పెట్టె తెరుచుకున్న వెంటనే అందులోంచి ఓ యువకుడు బయటకు వచ్చాడు. అది చూసిన కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. బయటకు వచ్చిన ఆ యువకుడు తనకేమీ తెలియనట్టుగా యువతి వెనుకవైపున నిలబడడం వీడియోలో ఉంది. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు అంతచిన్న పెట్టెలో యువకుడిని ఎలా దాచి పెట్టిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రియుడ్ని ట్రంక్ పెట్టెలో దాచిన ప్రియురాలు