Blast in Punjab: స్వర్ణ దేవాలయంలో సమీపంలో రెండోసారి బాంబ్ బ్లాస్ట్, పేలుడు తర్వాత ఆ ప్రాంతంలో భారీగా పొగల, అలర్ట్ అయిన పోలీస్ యంత్రాంగం
అమృత్‌సర్‌లోని హెరిటేజ్ స్ట్రీట్‌లో సోమవారం ఉదయం మరో పేలుడు సంభవించింది.(Amritsar heritage street) గోల్డెన్ టెంపుల్‌కు వెళ్లే మార్గంలో సారాగర్హి సరాయ్ సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్‌లో పేలుడు సంభవించింది.
అమృత్‌సర్‌లోని హెరిటేజ్ స్ట్రీట్‌లో సోమవారం ఉదయం మరో పేలుడు సంభవించింది.(Amritsar heritage street) గోల్డెన్ టెంపుల్‌కు వెళ్లే మార్గంలో సారాగర్హి సరాయ్ సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్‌లో పేలుడు సంభవించింది.గోల్డెన్ టెంపుల్(Golden Temple) పరిసరాల్లోని గత 24 గంటల్లో హెరిటేజ్ స్ట్రీట్‌లో ఇదే ప్రదేశానికి సమీపంలో పేలుడు సంభవించడం ఇది రెండోసారి.
పోలీసు కమిషనర్ సహా పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరీక్షల కోసం నమూనాలను సేకరిస్తున్నారు.ఈ పేలుడులో ఎవరూ గాయపడలేదు.పేలుడు తర్వాత ఆ ప్రాంతంలో పొగలు కూడా కనిపించాయి.హెరిటేజ్ స్ట్రీట్ పార్కింగ్ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు పేలుడు పదార్థాన్ని, బాంబును దారంతో వేలాడదీయడంతో పేలుడు సంభవించింది.ఈ పేలుడు ఘటనపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Here's Update