Brazil Suicide Bombing: వీడియో ఇదిగో, సుప్రీంకోర్టు వద్ద భారీ సూసైడ్ పేలుడు, ఒకరు మృతి, పేలుడు కారణంగా భయానక వాతావరణం
రెండు సార్లు పేలుడు సంభవించగా ఒకరు మృతి చెందారు. దీంతో, అప్రమత్తమైన సిబ్బంది కోర్టు లోపల ఉన్న జడ్జీలు, ఇతర సిబ్బందిని ఖాళీ చేయించారు. పేలుడు కారణంగా అక్కడ భయానక వాతావరణం నెలకొంది.
బ్రెజిల్ రాజధాని బ్రసీలియాలోని సుప్రీంకోర్టు వద్ద భారీ సూసైడ్ పేలుడు ఘటన చోటుచేసుకుంది. రెండు సార్లు పేలుడు సంభవించగా ఒకరు మృతి చెందారు. దీంతో, అప్రమత్తమైన సిబ్బంది కోర్టు లోపల ఉన్న జడ్జీలు, ఇతర సిబ్బందిని ఖాళీ చేయించారు. పేలుడు కారణంగా అక్కడ భయానక వాతావరణం నెలకొంది.అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు.. సుప్రీంకోర్టు లోపల ఉన్న జడ్జీలు, ఇతర సిబ్బందిని వెంటనే ఖాళీ చేయించారు. అనంతరం, కోర్టు సమయం ముగిసిన వెంటనే భారీ స్థాయిలో పేలుళ్లు జరిగాయని అధికారులు ప్రకటన విడుదల చేశారు. పేలుళ్ల ఘటనలో చనిపోయిన వ్యక్తి ఎవరనే విషయం తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. పేలుడు ఎలా జరిగిందనే విషయంపై దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.
Brazil Suicide Bombing:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)