Caught on Cam: ఢిల్లీలో మరో దారుణం, యువతిని బలవంతంగా క్యాబ్‌లోకి లాక్కెళ్లిన యువకులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువతిని యువకుడు బలవంతంగా క్యాబ్‌లోని ఎక్కించాడు. ఆమెను దుర్భాషలాడుతూ చొక్కా పట్టుకుని లాక్కెళ్లి కారులో పడేశాడు. కారుకు అటువైపు మరో యువకుడు కూడా నిలబడి ఉన్నాడు.మంగోల్‌పురిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.ఈ వీడియోను సుమోటోగా తీసుకుని ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు

Delhi Man abuses woman, forces her into cab (Photo-Video Grab)

దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువతిని యువకుడు బలవంతంగా క్యాబ్‌లోని ఎక్కించాడు. ఆమెను దుర్భాషలాడుతూ చొక్కా పట్టుకుని లాక్కెళ్లి కారులో పడేశాడు. కారుకు అటువైపు మరో యువకుడు కూడా నిలబడి ఉన్నాడు.మంగోల్‌పురిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.ఈ వీడియోను సుమోటోగా తీసుకుని ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. యువతిని వేధించిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. సీసీటీవీ రికార్డులను పరిశీలించారు.

ఇద్దరు యువకులు, ఓ యువతి రోహిణి నుంచి వికాస్‌పుర్‌ వరకు వెళ్లేందుకు ఈ క్యాబ్‌ను బుక్ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే వీరి మధ్య గొడవ జరిగిందని, ఆ తర్వాత యువతి రానని చెప్పగా.. బలవంతంగా తీసుకెళ్లారని వివరించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement