Caught on Cam: ఘోర ప్రమాదం..రెండు లారీల మధ్యలో చిక్కుకుని నుజ్జు నుజ్జైన కారు, డ్రైవర్ అక్కడికక్కడే మృతి, సోషల్ మీడియాలో సీసీ పుటేజీ వీడియో వైరల్

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో . ఒళ్లు జలదరింపజేసే ఈ ప్రమాదం జరిగింది. రెండు లారీల మధ్య చిక్కుకున్న ఒక కారు నుజ్జునుజ్జైంది. ఈ ఘటనలో కారు డ్రైవర్‌ మరణించాడు. పలాసుని ప్రాంతంలోని జాతీయ రహదారి 16 వద్ద సోమవారం ఉదయం ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడింది.

Car Crushed Between 2 Trucks In Bhubaneswar (Photo-Video Grab)

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో . ఒళ్లు జలదరింపజేసే ఈ ప్రమాదం జరిగింది. రెండు లారీల మధ్య చిక్కుకున్న ఒక కారు నుజ్జునుజ్జైంది. ఈ ఘటనలో కారు డ్రైవర్‌ మరణించాడు. పలాసుని ప్రాంతంలోని జాతీయ రహదారి 16 వద్ద సోమవారం ఉదయం ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడింది. దీంతో పలు వాహనాలు బారులు తీరాయి. ఒక లారీ వెనుక రెండు కార్లు ఆగి ఉన్నాయి. ఇంతలో లోడ్‌తో ఉన్న మరో లారీ వేగంగా ముందుకు వచ్చి ఆగిన కార్లపైకి దూసుకెళ్లింది. వైట్‌ కారు రోడ్డు డివైడర్‌ వైపునకు వెళ్లగా లారీ వెనుక ఉన్న నీలం రంగు కారు రెండు లారీల మధ్య ఇరుక్కుని నుజ్జునుజ్జైంది. సీసీటీవీలో రికార్డైన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement