CCTV Video: ఉగ్రవాదుల పనేనా, జమ్మూ కాశ్మీర్‌లో బస్సుల్లో గంటల వ్యవధిలో రెండు పేలుళ్లు, ఇద్దరికి గాయాలు,పేలుడు ఘటనలపై దృష్టి సారించిన భద్రతా బలగాలు
జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో (Udhampur) గంటల వ్యవధిలో రెండు అనుమానాస్పద పేలుళ్లు సంభవించాయి. బుధవారం రాత్రి ఆగిఉన్న బస్సులో పేలుగు సంభవించిన గంటల వ్యవధిలోనే రెండో పేలుడు చోటుచేసుకున్నది.
జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో (Udhampur) గంటల వ్యవధిలో రెండు అనుమానాస్పద పేలుళ్లు సంభవించాయి. బుధవారం రాత్రి ఆగిఉన్న బస్సులో పేలుగు సంభవించిన గంటల వ్యవధిలోనే రెండో పేలుడు చోటుచేసుకున్నది. ఉధంపూర్‌లోని పాతబస్టాండ్‌లో నిలిపిఉన్న బస్సులో గురువారం ఉదయం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అయితే ఈ ఘటనలో ఎవ్వరికీ ప్రమాదం జరుగలేదని అధికారులు వెల్లడించారు.
బుధవారం రాత్రి 10.45 గంటల సమయంలో ఉధంపూర్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న దొమాలి చౌక్ వద్ద ఓ బస్సులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ రెండు పేలుడు ఘటనలపై పోలీసులు, భద్రతా బలగాలు దృష్టిసారించాయి. గంటల వ్యవధిలోనే ఇవి చోటుచేసుకోవడంతో ఏమైనా ఉగ్రవాద కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement