Chhattisgarh Horror: యువతి పెళ్లికి ఒప్పుకోలేదని అంకుల్ దారుణం, జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకువచ్చి కత్తితో పొడుస్తూ అమానవీయ ప్రవర్తన, వీడియో సోషల్ మీడియాలో వైరల్, రంగంలోకి దిగిన పోలీసులు

రాయ్‌పూర్‌లోని గుఢియారీ ప్రాంతంలో పెండ్లికి నిరాకరించిందనo కోపంతో 19 ఏళ్ల యువతని ఓ 47 ఏళ్ళ వ్యక్తి దారుణంగా హింసించాడు. పదునైన ఆయుధంతో దాడిచేసి నడి రోడ్డుపై జట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లాడు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది

Representational Image | (Photo Credits: IANS)

రాయ్‌పూర్‌లోని గుఢియారీ ప్రాంతంలో పెండ్లికి నిరాకరించిందనo కోపంతో 19 ఏళ్ల యువతని ఓ 47 ఏళ్ళ వ్యక్తి దారుణంగా హింసించాడు. పదునైన ఆయుధంతో దాడిచేసి నడి రోడ్డుపై జట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లాడు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.నిందితుడిని ఓంకార్‌ తివారీ అలియాస్‌ మనోజ్‌గా గుర్తించారు. బాధితురాలు అతని వద్ద పనిచేస్తున్న యువతిగా గుర్తించారు.

ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని రాయ్‌పూర్‌ సీనియర్‌ ఎస్పీ ప్రశాంత్‌ అగర్వాల్‌ చెప్పారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. నింధితుడికి కఠినంగా శిక్షిస్తామన్నారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement